యాసంగి పంట వేయొద్దంటున్న మంత్రులు.. రైతులకు భరోసా ఏదీ? | తెలంగాణ వ్యవసాయం
తెలంగాణలో రైతుల పరిస్థితి రోజురోజుకూ ఆందోళనకరంగా మారుతోందని ప్రతిపక్ష విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకవైపు విద్యుత్ సరఫరాలో సమస్యలు, మరోవైపు సాగునీటి కొరత, ఎరువుల కోసం ఇబ్బందులు.. ఇంకోవైపు పంటలకు గిట్టుబాటు ధర, బోనస్‌పై స్పష్టత లేకపోవడంతో రైతులు సతమతమవుతున్నారని విమర్శకులు అంటున్నారు. ఇలాంటి సమయంలో యాసంగి పంట వేయవద్దని మంత్రులు సూచించడం రైతుల్లో మరింత ఆందోళన కలిగిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో సాగునీటి వనరులపై ఒత్తిడి ఉన్నందున యాసంగిలో వరి సాగు చేసి నష్టపోవద్దని రెవెన్యూ మంత్రి…

