కన్నపల్లి పంప్‌హౌస్ వద్ద గోదావరిలో సమృద్ధిగా నీరు.. వెంటనే లిఫ్టింగ్ ప్రారంభించి ఎగువ ఆయకట్టు రైతులను ఆదుకోవాలని డిమాండ్
గోదావరి నదిలో ప్రస్తుతం నీటి లభ్యతపై మరోసారి చర్చ మొదలైంది. కన్నపల్లి పంప్‌హౌస్ ప్రాంతాన్ని పరిశీలించిన సందర్భంగా గోదావరిలో తగినంత నీరు అందుబాటులో ఉందని, ప్రభుత్వం వెంటనే నీటి ఎత్తిపోతల కార్యక్రమాన్ని ప్రారంభించాలని రైతులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రాణహిత నది గోదావరిలో కలిసిన అనంతరం కన్నపల్లి పంప్‌హౌస్ సమీపంలో గోదావరి ప్రవాహం బలంగా కొనసాగుతోంది. మేడిగడ్డ బ్యారేజ్ దిగువన గోదావరి సహజంగా ప్రవహిస్తున్నప్పటికీ, బ్యారేజ్‌కు ఎలాంటి నష్టం లేదని, నీరు నిరంతరంగా కిందికి పారుతోందని స్థానిక…

