సృష్టి ఫెర్టిలిటీ కుంభకోణం తరహాలో కొత్త మెడికల్ మాఫియా బహిర్గతం – డాక్టర్ రాజా కొప్పల వివాదం

తెలంగాణలో మరో పెద్ద మెడికల్ కుంభకోణం బహిర్గతమైంది. “వాస్కులర్ సర్జన్” అని చెప్పుకుంటూ, అసలు అర్హతలేని ఒక రేడియాలజిస్ట్‌ భారీ స్థాయిలో ప్రజలను మోసం చేస్తున్నాడని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. డాక్టర్ రాజా కొప్పల అనే ఈ వ్యక్తి, రూరల్ రైతులకు ఉచిత చికిత్స అందిస్తానని చెప్పి NABARD నుంచి దాదాపు ₹20–₹25 కోట్ల వరకు లోన్ తీసుకున్నారని, అయితే నాబార్డ్ సాధారణంగా మెడికల్ ఫీల్డ్‌కి లోన్లు ఇవ్వదని ఆరోపణలు ఉన్నాయి.

రిపోర్ట్స్‌ ప్రకారం, ఆయ‌న వాస్కులర్ సర్జన్‌ కాదు, కేవలం ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్‌ మాత్రమే, అంటే సర్జరీ చేయడానికి అర్హత లేని వ్యక్తి. అయినప్పటికీ, ఆయ‌న “సర్జరీ”, “లేజర్ ట్రీట్మెంట్” పేర్లతో పేద రోగులపై లాభం కోసం ఆపరేషన్లు చేస్తున్నారని జర్నలిస్టులు, పేషెంట్లు, వైద్యవర్గాలు చెబుతున్నాయి.

ఒకే పేషెంట్‌పై రెండుసార్లు లేజర్ సర్జరీ పేరుతో ₹4.5 లక్షల వరకు వసూలు చేసినట్లు, మరో కేసులో రెండు నిమిషాల డాప్లర్ స్కాన్ తరువాత వెంటనే సర్జరీ చేయాలని ఒత్తిడి చేసినట్లు సాక్ష్యాలు బయటకొచ్చాయి. మరికొందరు పేషెంట్లు ఈ సర్జరీల వల్ల తీవ్ర నష్టం పొందినట్లు, కాళ్లలో అల్సర్స్ మరింత పెరిగినట్లు ఫిర్యాదులు వెల్లువెత్తాయి.

ఇదంతా తెలుసుకున్న జర్నలిస్టులు IMA (Indian Medical Association) మరియు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ అధికారులతో సంప్రదించి, డాక్టర్ రాజా కొప్పల వ్యవహారంపై విచారణ ప్రారంభించాల్సిందిగా డిమాండ్ చేశారు. ఈ కేసు వెనుక భారీ స్థాయిలో “మెడికల్ మాఫియా రాకెట్” ఉందని ఆరోపణలు ఉన్నాయి.

జర్నలిస్ట్ దాసర్ శ్రీనివాస్ మాట్లాడుతూ —

పేద ప్రజలను లక్షల రూపాయలతో మోసం చేస్తున్న ఈ మాఫియాను ఆపడం ప్రభుత్వానికి బాధ్యత. NABARD లాంటి సంస్థ నుంచి ఫ్రీ ట్రీట్మెంట్ పేరిట కోట్ల రూపాయల లోన్లు తీసుకొని ప్రజలను మోసం చేయడం నేరం,” అని పేర్కొన్నారు.

ప్రస్తుతం ఆరోగ్య శాఖ, ఐఎంఏ, వాస్కులర్ అసోసియేషన్‌లకు అధికారిక ఫిర్యాదులు చేరాయి. బాధితులు కూడా తమ అనుభవాలను మీడియా ముందు వెల్లడించారు. ఈ కేసులో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *