ముక్కుతో బీర్ తాగిన వ్యక్తి వీడియో వైరల్

మన దేశంలో మద్యం విక్రయాలు ప్రభుత్వాలకు పెద్ద ఆదాయ వనరుగా నిలుస్తున్నాయి. మద్యాన్ని తాగడం, దాన్ని ప్రదర్శించడంలో కూడా కొందరు వింత రకాల స్టైల్‌లు ప్రదర్శిస్తుంటారు. కానీ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో మాత్రం అందరినీ అవాక్కయ్యేలా చేసింది.

ఆ వీడియోలో ఓ వ్యక్తి బీర్‌ను ముక్కుతో తాగడం చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు! సాధారణంగా మద్యం నోటితో తాగే విషయం మనం చూస్తూనే ఉంటాం. కానీ ఈ వ్యక్తి మాత్రం ముక్కుతో మొత్తం గ్లాస్‌లోని బీర్‌ను ఒక్కసారిగా తాగేశాడు.

వీడియోలో గమనించినట్లయితే, ఆ వ్యక్తి బీర్ గ్లాస్‌ను చేతుల్లో పట్టుకొని మొదట కొన్ని సార్లు ముందు వెనక్కు ఊగి, దేవుడు ఒంట్లోకి వచ్చినట్టుగా ప్రవర్తించాడు. తర్వాత గ్లాస్‌ను ముక్కు వద్దకు తీసుకెళ్లి కింద పెట్టకుండా మొత్తం బీర్‌ను ముక్కు ద్వారా తాగేశాడు.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, నెటిజన్ల కామెంట్లు కూడా తెగ పేలుతున్నాయి.
కొంతమంది – “అలా ఎలా తాగేశావురా బాబు!” అని ఆశ్చర్యపోతుండగా, ఇంకొందరు – “ఇలా తాగాక ఇంకా బతికే ఉన్నాడా?” అంటూ ఫన్నీగా స్పందిస్తున్నారు.
ఇంకొందరు మాత్రం – “ఎంత మంది మందుబాబులు చూశాం కానీ నువ్వు చాలా స్పెషల్ గురూ!” అంటూ నవ్వులు పంచుతున్నారు.

ఈ వీడియో ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, మరియు ఎక్స్ (ట్విట్టర్)లో వేగంగా వైరల్ అవుతుంది.
మద్యం తాగడంలో కూడా కొత్త స్టైల్ చూపించిన ఈ వ్యక్తి సోషల్ మీడియాలో స్టార్‌గా మారిపోయాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *