తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలపై ఇప్పుడు ప్రజలు గట్టిగా ప్రశ్నిస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ముఖ్యంగా, ఉద్యమ సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందన్న విమర్శలు తీవ్రస్థాయిలో వినిపిస్తున్నాయి.
“ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇస్తాం” అన్న హామీ ఇంతవరకూ అమలు కాలేదని ఆగ్రహ స్వరాలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు ఉద్యమంలో రక్తం, చెమట చిందించిన ప్రజలు… ఇప్పుడు తమ హక్కుల కోసం మళ్ళీ రోడ్ల మీదికి రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అన్న ప్రశ్న వేగంగా పెరుగుతోంది.
అంతేకాదు, ప్రభుత్వం ప్రకటించిన నిరుద్యోగ భృతి, విద్యా హక్కులు, మహిళలకు మద్దతు వంటి హామీలు కూడా కాగితం మీదే మిగిలిపోయాయని ప్రజలు ఆరోపిస్తున్నారు.
ఇక మరోపక్క, గ్లోబల్ సమ్మిట్, పెద్ద పెద్ద కార్యక్రమాలు, సెలబ్రిటీ ప్రమోషన్లపై ప్రభుత్వ ఖర్చులు పెరుగుతుండడం, హామీల అమలులో మాత్రం ఆలస్యం జరగడం ప్రజల్లో అసహనాన్ని పెంచుతోంది.
“ఒక ప్రభుత్వం మాట ఇస్తే — అది కాంట్రాక్ట్, అగ్రిమెంట్ లాంటిదే. ఆ మాట తప్పితే బాధ్యత ఎవరదే?” అనే ప్రశ్నతో విమర్శకులు ప్రభుత్వాన్ని నేరుగా సవాలు చేస్తున్నారు.
పార్టీ మేనిఫెస్టో తయారీలో కీలక పాత్ర పోషించిన సునీల్ కనుగోలు, అలాగే ప్రభుత్వం తీరుపై కూడా విమర్శలు పెరుగుతున్నాయి.
ప్రజల మాటల్లో ఒక స్పష్టమైన సందేశం వినిపిస్తోంది:
భరోసా ఇచ్చినవాళ్లు… ఇప్పుడు బాధ్యత ఎందుకు తీసుకోవడం లేదు?”
డిసెంబర్లో 2 సంవత్సరాలు పూర్తి కానున్న నేపథ్యంలో, ఆరు గ్యారెంటీల అమలుపై ప్రభుత్వం స్పష్టమైన రోడ్‌మ్యాప్ ప్రకటించాలని డిమాండ్లు పెరుగుతున్నాయి.

