తెలంగాణ రాష్ట్ర సాధన ఎంత సులువు కాదు. దశాబ్దాల పోరాటం, వేల మంది విద్యార్థుల త్యాగం, ప్రజల ఆరాటం—all came together to build what today we proudly call Telangana.
సమష్టి ఉద్యమాలు, సమ్మెలు, నిరసనలు చేయగా ప్రభుత్వాలు స్పందించని సందర్భంలో, కేసీఆర్ చేపట్టిన అమరణ నిరాహార దీక్ష తెలంగాణ ఉద్యమానికి కీలక మలుపు ఇచ్చింది. ఆల్కాపురి చౌరస్థ నుండి దీక్షకు బయలుదేరిన కేసీఆర్‌ని అరెస్టు చేసి NIMSకు తరలించగా, అక్కడే ఆయన 11 రోజులు దీక్ష కొనసాగించారు.
డాక్టర్లు ప్రాణాపాయం ఉందని ప్రకటించిన నేపథ్యంలో, ఆ రోజు అర్ధరాత్రి కేంద్ర మంత్రి చిదంబరం “తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ ప్రారంభమవుతోంది” అని ప్రకటన చేశారు. ఆ రోజు తెలంగాణ చరిత్రలో తిరుగులేని విజయదివస్గా నిలిచిపోయింది.
ఆ తర్వాత తెలంగాణ వ్యాప్తంగా సంబరాలు, ప్రజల్లో కొత్త ఆశలు మరియు భవిష్యత్తుపై నమ్మకం మొదలైంది.
1969లో ప్రారంభమైన ఉద్యమం, 1972 ప్రజా సమితి విజయంతో కొనసాగి, 2001లో కేసీఆర్ తెలంగాణ భావజాలానికి నూతన దిశ ఇచ్చారు. ఉద్యోగులు, విద్యార్థులు, కార్మికులు, రైతులు—ప్రతి వర్గాన్ని ఐక్యం చేసి, హింసకు తావు లేకుండా గాంధేయ మార్గంలో ప్రజల పోరాటాన్ని ముందుకు నడిపారు.
నీళ్లు – నిధులు – నియామకాల కోసం ప్రారంభమైన ఈ పోరాటం చివరకు ఓ రాష్ట్రంగా అవతరించడం చరిత్రలో మరపురాని ఘట్టం.
ఈ రోజు తెలంగాణ ప్రజలు, విద్యార్థులు, యువత, ఉద్యమంలో భాగమైన ప్రతీ ఒక్కరూ దీన్ని విజయం రోజు, గౌరవం రోజు, త్యాగం రోజు అంటూ జరుపుకుంటున్నారు.

