తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితపై కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బిఆర్ఎస్ నాయకులపై కవిత చేసిన విమర్శల నేపథ్యంలో మంగళవారం అతను మీడియాతో మాట్లాడారు.
కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మల్లారెడ్డి, కూకట్పల్లి, కుద్బుల్లాపూర్ ఎమ్మెల్యేలపై కవిత చేసిన ఆరోపణలను కృష్ణారావు తప్పుబట్టారు. “బంగారు తెలంగాణ పేరుతో ప్రజలకు లాభం ఏమీ లేదు… కానీ కొందరు నాయకులు మాత్రం బాగా సంపాదించుకున్నారు అని నిన్న కవిత చేసిన వ్యాఖ్యలు పూర్తిగా తప్పు” అని మండిపడ్డారు.
“నువ్వు జైలుకి ఎందుకు వెళ్లావో చెప్పు… నీ ఇంట్లో కుక్క పేరు కూడా విస్కీ అని పెట్టుకున్నావ్. నీ భర్తకు హైదరాబాదు లోని ఆస్తులు ఎక్కడివి? బతుకమ్మ పేరిట కోట్లాది రూపాయలు వసూలు చేశావు” అంటూ విమర్శలు చేశారు.
తెలంగాణ నుంచి ఢిల్లీ వరకూ కవిత అవినీతి భాగోతం తెలిసినట్టే ఉందని, ఢిల్లీలో కేజ్రీవాల్ ను నాశనం చేశావు, ఇప్పుడు కేసీఆర్-కేటీఆర్ పై కుట్రలు చేస్తున్నావని ఆరోపించారు. “బిఆర్ఎస్ లో హరీష్ రావును బయటకు పంపించి పార్టీపై పూర్తిగా పట్టు సాధించాలనేది కవిత లక్ష్యం” అన్నారు.
కవిత భర్తకు బాలనగర్ IDPL సర్వే నంబర్లలో 36 ఎకరాల భూమి ఎలా వచ్చిందని ప్రశ్నించారు. “బెదిరించి డబ్బులు వసూలు చేయడం నీ అలవాటు. ఈ నాలుగు రోజుల్లో ఎవరెవరికీ ఫోన్ చేశావో నాకు తెలుసు” అంటూ హెచ్చరించారు.
మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ — “కూకట్పల్లి లో నేను 10 ఏళ్లలో ఏం చేశానో ప్రజలకు తెలుసు. నువ్వు ఎవరు? నీలాంటి వాళ్లు చాలా మంది రాజకీయాల్లో మరుగుతుంటారు. మరోసారి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే… నీ చిట్టా మొత్తం బయట పెడతా” అని అన్నారు.
మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ — “కూకట్పల్లి లో నేను 10 ఏళ్లలో ఏం చేశానో ప్రజలకు తెలుసు. నువ్వు ఎవరు? నీలాంటి వాళ్లు చాలా మంది రాజకీయాల్లో మరుగుతుంటారు. మరోసారి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే… నీ చిట్టా మొత్తం బయట పెడతా” అని అన్నారు.
ఇక కవిత మాత్రం బిఆర్ఎస్ విజయదివాస్ పై స్పందిస్తూ “అధికారం కోల్పోయాకే ఉద్యమాలు, దివాస్ లు గుర్తొస్తాయి” అని ఎక్స్ లో పోస్ట్ చేశారు. దీనిపై నెటిజన్లు కూడా స్పందిస్తూ “అధికారంలో ఉన్నప్పుడు ఏమీ కనిపించదు… అధికారం పోయాకే ప్రజల సమస్యలు గుర్తొస్తాయి” అంటూ విమర్శించారు.
ఒక పక్క కవిత వ్యాఖ్యలు, మరో పక్క బిఆర్ఎస్ నేతల ప్రతిస్పందనలు — ఇలా రెండువైపులా ఆరోపణలు, ప్రతిఆరోపణలతో రాజకీయ వాతావరణం వేడెక్కింది.

