అఖండ 2: తాండవం – వారణాసి లో బాలయ్య స్పెషల్ ప్రమోషన్ టూర్
నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కలయిక అంటేనే ప్రేక్షకుల్లో ప్రత్యేక క్రేజ్ ఉంటుంది. ఇరువురి కాంబినేషన్ లో వచ్చిన తాజా మూవీ ‘అఖండ 2: తాండవం’ ఇటీవలే థియేటర్లలోకి విడుదలైంది. ఫస్ట్ పార్ట్ సెన్సేషన్ క్రియేట్ చేసిన నేపథ్యంలో ఈ సినిమాకు భారీ హైప్ ఏర్పడింది. అయితే రిలీజ్ తర్వాత మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ కలెక్షన్స్ డ్రాప్ కాకుండా సినిమాను నిలబెట్టడానికి మేకర్స్ స్ర్టాటజీ ప్రకారం క్రమంగా ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ పరిణామంలో భాగంగా బాలకృష్ణ, బోయపాటి శ్రీను తాజాగా వారణాసి ను సందర్శించారు. ఎయిర్పోర్ట్ లో దిగినప్పటి నుండి, కాశీ విశ్వనాధుని దర్శనం వరకు విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సినిమా సక్సెస్ కోసం, లాంగ్ రన్ కలెక్షన్స్ స్టేబుల్గా ఉంచడానికి బాలయ్య ప్రత్యేక పూజలు చేశారు. అలాగే సినిమా ప్రమోషన్ కొనసాగించడమే టూర్ ప్లాన్ లో ముఖ్య ఉద్దేశ్యం.
వారిని చూసి ఫ్యాన్స్ పెద్ద ఎగబడినారు. తెలుగు ఆడియెన్స్ మాత్రమే కాదు, నార్త్ ఇండియా ప్రేక్షకులు కూడా బాలయ్యను గుర్తించి సెల్ఫీలు, షేక్ హ్యాండ్స్ కోసం పోటీ పడారు. సాధారణంగా సీరియస్ గా కనిపించే బాలయ్య అక్కడ చాలా కూల్ మరియు సింపుల్ గా కనిపించారు.
నిరంతరంగా మిక్స్డ్

