డ్రగ్స్ కేసులో టాలీవుడ్ నటుడు నవదీప్‌కు భారీ ఊరట లభించింది. అతనిపై నమోదైన డ్రగ్స్ కేసును హైకోర్టు కొట్టివేస్తూ కీలక తీర్పు ఇచ్చింది. గుడిమల్కాపూర్‌లో నమోదైన డ్రగ్స్ కేసులో నవదీప్‌ను నిందితుడిగా చేర్చడంపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.
నవదీప్ తరఫున వాదనలు వినిపించిన అడ్వకేట్ వెంకట్ సిద్ధార్థ్.. నటుడి వద్ద ఎలాంటి డ్రగ్స్ కూడా లభించలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. స్పాట్లో జరిగిన తనిఖీల్లోనూ నవదీప్ వద్ద నిషేధిత పదార్థాలు ఏవీ దొరకలేదని వివరించారు. అయితే, ఎఫ్ఐఆర్లో మాత్రమే నవదీప్ పేరు చేర్చారని కోర్టుకు తెలియజేశారు.
ఈ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు.. ఆధారాలు లేకుండా కేసు నమోదు చేయడం సరికాదని అభిప్రాయపడింది. స్పాట్లో డ్రగ్స్ లభించని నేపథ్యంలో, నవదీప్‌పై కొనసాగుతున్న కేసును కొట్టివేస్తున్నట్లు స్పష్టం చేసింది.
ఈ తీర్పుతో నవదీప్‌కు చట్టపరమైన ఉపశమనం లభించగా, ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత కొంతకాలంగా ఈ కేసు కారణంగా నవదీప్ ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యంలో, హైకోర్టు తీర్పు ఆయనకు పెద్ద ఊరటనిచ్చిందని చెప్పవచ్చు.

