ఎక్విడేషన్ పేరుతో జర్నలిస్టుల గొంతు నొక్కడం ప్రజాస్వామ్య విరుద్ధం

ఎక్విడేషన్ పేరుతో జర్నలిస్టుల గొంతు నొక్కే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఎన్హెచ్ఆర్సి రాష్ట్ర సెక్రెటరీ సామశివరావు తీవ్రంగా విమర్శించారు. పత్రిక హక్కును కార్డుతో ముడిపెట్టడం పూర్తిగా ప్రజాస్వామ్య విరుద్ధమని ఆయన స్పష్టం చేశారు. ఇటువంటి ఉత్తరులు జర్నలిస్టులపై మానసిక ఒత్తిడి పెంచేవిగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

జర్నలిస్టులకు ఎక్విడేషన్ ఉన్నా లేకున్నా, ప్రజాస్వామ్య వ్యవస్థలో పని చేసే హక్కు, రాసే హక్కు, మాట్లాడే హక్కు ఉంటుందని ప్రభుత్వం గుర్తించాలన్నారు. వాహనాలపై ‘ప్రెస్’ అనే పదాన్ని నిషేధించడం జర్నలిస్టులను రోడ్లపై అవమానించడమేనని వ్యాఖ్యానించారు. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టినట్లేనని ఆందోళన వ్యక్తం చేశారు.

అవసరమైతే ఎక్విడేషన్లు దుర్వినియోగం కాకుండా చూడాలన్నారు. ప్రెస్ అనేది ఒక వృత్తి తప్ప ప్రభుత్వ అనుమతి కాదని స్పష్టం చేశారు. ఈ జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

జర్నలిస్టుల హక్కులకు భంగం కలిగిస్తే ఎన్హెచ్ఆర్సి చూస్తూ ఊరుకోదని, అవసరమైతే ఉద్యమ స్థాయిలో స్పందిస్తామని సామశివరావు హెచ్చరించారు. ప్రజాస్వామ్యానికి నాలుగో స్థంభమైన మీడియాను కట్టడి చేయడం దేశానికి ప్రమాదకరమని ఆయన అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *