మావోయిస్టు అగ్రనేతల లొంగుబాటు… ప్రజాస్వామ్య రాజకీయాల్లోకి ప్రవేశం ప్రకటించిన దేవజి, మల్లారాజిరెడ్డి

తెలంగాణలో కీలక రాజకీయ-భద్రతా పరిణామంగా భావిస్తున్న ఘటనలో సిపిఐ మావోయిస్టు పార్టీ కు చెందిన అగ్రనేతలు అజ్ఞాతం వీడి అధికారికంగా లొంగుబాటు ప్రకటించారు. ఈ కార్యక్రమం హైదరాబాద్ లోని బంజారా హిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో జరిగింది.

ఈ లొంగుబాటు కార్యక్రమం శివధర్ రెడ్డి సమక్షంలో జరిగింది. ప్రభుత్వ పునరావాస విధానాల ఫలితంగానే ఈ లొంగుబాట్లు సాధ్యమయ్యాయని పోలీసులు తెలిపారు.

లొంగుబాటు చేసిన వారిలో సెంట్రల్ కమిటీ సభ్యుడు తిప్పిరి తిరుపతి (దేవజి), కేంద్ర కమిటీ సభ్యుడు మల్ల రాజిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి బడే చొక్కారావు, రాష్ట్ర కమిటీ సభ్యుడు నరసింహా రెడ్డి ఉన్నారు.

లొంగుబాటు అనంతరం మీడియాతో మాట్లాడిన దేవజి, మల్లారాజిరెడ్డి ఇకపై ప్రజాస్వామ్య మార్గంలో ప్రజల సమస్యలపై పోరాటం చేస్తామని ప్రకటించారు. సాయుధ పోరాటం నుంచి చట్టబద్ధ రాజకీయాల వైపు మారుతూ ప్రజా సమస్యలను అసెంబ్లీ, ప్రజాక్షేత్రాల్లో లేవనెత్తుతామని తెలిపారు.

లొంగుబాటు చేసిన నాయకులకు ప్రభుత్వం పునరావాస ప్యాకేజీ కింద ఆర్థిక సహాయం అందజేసినట్లు సమాచారం. వారి ప్రాణాలకు రక్షణ కల్పిస్తామని పోలీసులు హామీ ఇచ్చారు.

దశాబ్దాల పాటు అజ్ఞాత జీవితం గడిపిన అగ్రనేతలు ప్రజా జీవితంలోకి రావడం ప్రాంతీయ రాజకీయాల్లో కీలక పరిణామంగా విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రజా సమస్యలపై నేరుగా రాజకీయంగా పోరాడతామని ప్రకటించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

ఇకపై ఈ నేతలు రాజకీయాల్లో ఎలా ముందుకు సాగుతారు, ఏ రూపంలో ప్రజా ఉద్యమాలను నడిపిస్తారన్నది ఆసక్తిగా మారింది. ప్రజా సమస్యలపై పోరాటం ప్రజాస్వామ్య మార్గంలో కొనసాగుతుందా అన్నది భవిష్యత్తు నిర్ణయిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *