Chandana R

యానిమల్’ రూట్లో ‘రాజా సాబ్’.. మూడు గంటల రిస్క్ మ్యాజిక్ వర్కవుట్ అవుతుందా?

ఈ మధ్య కాలంలో ఆడియెన్స్ మైండ్ సెట్ మారింది. కంటెంట్ లో దమ్ముంటే మూడు గంటలైనా కదలకుండా కూర్చుంటున్నారు. ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలే ఇందుకు సాక్ష్యాలు. ఇప్పుడు రెబల్ స్టార్ ప్రభాస్ ‘రాజా సాబ్’ కూడా ఇదే ధైర్యం చేస్తోంది. ఈ మధ్య కాలంలో ప్రభాస్ నుంచి హై వోల్టేజ్ సినిమాలు వచ్చాయి. కానీ డార్లింగ్ ని ఫన్ మోడ్ లో చూసి చాలా కాలమైంది. దీంతో మారుతి ఆ వింటేజ్ ప్రభాస్ ను…

Read Full News

తారక్ ప్లేస్‌లోకి బన్నీ.. త్రివిక్రమ్ న్యూ పాన్ ఇండియా ప్లాన్ ఇదే!

తారక్ ప్లేస్ లోకి బన్నీ.. గురూజీ న్యూ ప్లాన్ ఇదే!మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం వెంకటేశ్ తో ఆదర్శ కుటుంబం అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. క్లాస్, ఫ్యామిలీ ఆడియెన్స్ కు నచ్చేలా ఈ సినిమాను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే త్రివిక్రమ్ ఆ తరువాత చేయబోయే భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గురించి ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక ఆసక్తికరమైన…

Read Full News

ఫ్యాన్స్ ‘అతి’ ప్రేమపై సమంత, నిధి అగర్వాల్ మెచ్యూర్డ్ రియాక్షన్.. ఇండస్ట్రీలో హాట్ టాపిక్

ఫ్యాన్స్ ‘అతి’ ప్రేమపై సమంత, నిధి రియాక్షన్.. ఏమన్నారంటే..స్టార్ హీరోయిన్లు పబ్లిక్ లోకి వచ్చినప్పుడు ఫ్యాన్స్ ఎగబడటం, తోపులాట జరగడం ఈ మధ్య కామన్ అయిపోయింది. రీసెంట్ గా జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో స్టార్ హీరోయిన్లు సమంత, నిధి అగర్వాల్ ఇలాంటి పరిస్థితులనే ఎదుర్కొన్నారు. అయితే ఇద్దరూ కూడా ఫ్యాన్స్ విషయంలో చాలా మెచ్యూర్డ్ గా ఆలోచించి, వారిపై కోప్పడకుండా చాలా పాజిటివ్ గా రియాక్ట్ అవ్వడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది….

Read Full News

ఇండియన్ సినిమా గేమ్ ఛేంజర్స్.. తరతరాల ట్రెండ్స్‌ను మార్చిన దర్శకులు

ఇండియన్ సినిమా గేమ్ ఛేంజర్స్.. తరతరాల ట్రెండ్స్‌ను మార్చిన దర్శకులు ప్రతి ముప్పై సంవత్సరాలకు ఒకసారి మనుషుల ఆలోచన విధానం మారుతుంది. దాన్నే కొందరు ట్రెండ్ అంటారు, మరికొందరు జనరేషన్ అంటారు. కానీ ప్రతి తరంలోనూ ఆలోచనల్ని మార్చి కొత్త దిశ చూపించే వ్యక్తి మాత్రం ఒకడే ఉంటాడు. వాడే టార్చ్ బేరర్. ఈ మాటలు అరవింద సమేత సినిమాలో రావురమేష్ డైలాగ్‌లా కనిపించినా, అవి ఇండియన్ సినిమా చరిత్రకు అచ్చంగా సరిపోతాయి. భారతీయ సినిమా గత…

Read Full News

కొట్టలగూడ–లాసింగ్ తాండా గ్రామాల అభివృద్ధికి పూర్తి బాధ్యత నాది: వికారాబాద్ ఎమ్మెల్యే స్పష్టం

కొత్తగా ఎన్నికైన మహిళా సర్పంచులు, వార్డు సభ్యులకు అభినందనలు తెలుపుతూ వికారాబాద్ నియోజకవర్గంలో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి లాసింగ్ తాండా, కొట్టలగూడ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో మహిళలు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. సభను ఉద్దేశించి మాట్లాడిన వికారాబాద్ ఎమ్మెల్యే, కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులందరికీ చప్పట్లతో అభినందనలు తెలియజేయాలని పిలుపునిచ్చారు. కొట్టలగూడ, లాసింగ్ తాండా గ్రామాల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం అందించే పూర్తి బాధ్యత తనదేనని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో…

Read Full News

బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులను ఖండిస్తూ వికారాబాద్‌లో కొవ్వత్తుల ర్యాలీ

బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ భారతదేశ వ్యాప్తంగా హిందూ సంఘాలు నిరసనలు చేపడుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లా కేంద్రంలో విశ్వహిందూ పరిషత్ (విహెచ్‌పీ) ఆధ్వర్యంలో కొవ్వత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ హిందూ సంఘాల నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. గత ఆగస్టు నెల నుంచి బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై వరుస దాడులు జరుగుతున్నాయని, ఇది తీవ్రంగా ఆందోళన కలిగించే అంశమని వక్తలు పేర్కొన్నారు. మతపరమైన గుర్తింపు…

Read Full News

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఆగ్రహం.. 10 వేల కోట్లు వెంటనే చెల్లించాలి: ఎస్. దుర్గయ్యగౌడ్

బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని బీసీ పొలిటికల్ ఫ్రంట్ వైస్ చైర్మన్ ఎస్. దుర్గయ్యగౌడ్ ఆరోపించారు. హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద సుమారు రూ.10 వేల కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. నిన్న ఉపముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ.365.75 కోట్లను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారని, అయితే…

Read Full News

కేసీఆర్ ప్రెస్ మీట్‌పై కాంగ్రెస్ ఫైర్.. 10 ఏళ్ల పాలనలో ఒక్క అభివృద్ధి చూపించండి: చెన్నగాని దయాకర్

ఇటీవల మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు సంవత్సరాల విరామం తర్వాత నిర్వహించిన ప్రెస్ మీట్ తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో ఓకే టీవీకి ఇచ్చిన ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూలో టీపీసీసీ అధికార ప్రతినిధి, టీపీసీసీ జనరల్ సెక్రటరీ చెన్నగాని దయాకర్ కేసీఆర్ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కేసీఆర్ ప్రెస్ మీట్ పూర్తిగా అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలకే పరిమితమైందని, కానీ తన పదేళ్ల పాలనలో తెలంగాణకు చేసిన ఒక్క…

Read Full News

రవాణా శాఖలో అవినీతి తిమింగలం.. డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ కిషన్ నాయక్ వద్ద రూ.200 కోట్ల ఆస్తులు బయటపడ్డాయి

రవాణా శాఖలో భారీ అవినీతి తిమింగలం వెలుగులోకి వచ్చింది. మహబూబ్‌నగర్ జిల్లా డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ (డీటీసీ) ఎం. కిషన్ నాయక్ వద్ద ఆదాయానికి మించిన ఆస్తులు భారీగా ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ప్రాథమిక అంచనాల ప్రకారం ఆయన వద్ద ఉన్న ఆస్తుల బహిరంగ మార్కెట్ విలువ సుమారు రూ.200 కోట్ల వరకు ఉంటుందని ఏసీబీ వెల్లడించింది. ఈ నేపథ్యంలో కిషన్ నాయక్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న ఫిర్యాదుల…

Read Full News

న్యూ ఇయర్ వేడుకలపై ఎక్సైజ్ కఠిన ఆంక్షలు.. డ్రగ్స్ వాడితే పీడీ కేసులు, ఈవెంట్ పర్మిషన్ తప్పనిసరి

నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా మాదకద్రవ్యాలు, అక్రమ మద్యం వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ కఠిన చర్యలకు సిద్ధమైంది. వేడుకల ముసుగులో డ్రగ్స్, గంజాయి, సింథటిక్ డ్రగ్స్ వాడితే పీడీ యాక్ట్ కింద కేసులు తప్పవని అధికారుల గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఈవెంట్ పర్మిషన్ లేకుండా వేడుకలు నిర్వహిస్తే నేరుగా జైలుకే పంపిస్తామని స్పష్టం చేశారు. ఈ నెల 27 నుంచి 29 వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించనున్నట్లు ఎక్సైజ్…

Read Full News