పావుగంట వానకే హైదరాబాద్ హైరానా.. హైడ్రాకు ముందు, హైడ్రా తర్వాత ఏం మారింది?
హైదరాబాద్లో మంగళవారం సాయంత్రం కురిసిన తొలి భారీ వర్షం మహానగర వాస్తవ పరిస్థితులను మరోసారి బయటపెట్టింది. కేవలం 20 నుంచి 30 నిమిషాల పాటు కురిసిన వర్షానికే నగరం అతలాకుతలమైంది. ప్రధాన రహదారుల నుంచి గల్లీల వరకు నీరు నిలిచిపోవడంతో జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది. కార్లు నీటిలో చిక్కుకుపోయాయి. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇంతటి పరిస్థితి ఏర్పడుతుందని ఎవరూ ఊహించలేదు. ముఖ్యంగా…

