Chandana R

సర్కార్ చేతుల్లోకి హైదరాబాద్ మెట్రో.. ఎల్ అండ్ టీ షేర్ల బదిలీ పూర్తి.. పెట్రోల్ కొరతపై కేంద్రం క్లారిటీ

హైదరాబాద్ నగర రవాణా వ్యవస్థలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటివరకు పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంలో కొనసాగిన హైదరాబాద్ మెట్రో ఫేజ్-1 ప్రాజెక్ట్ ఇప్పుడు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చింది. ఎల్ అండ్ టీ సంస్థకు చెందిన 100 శాతం షేర్లను తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేస్తూ కీలక ఒప్పందం కుదుర్చుకుంది. సచివాలయంలో జరిగిన ఈ ఒప్పందం ప్రకారం రూ.1461 కోట్ల విలువైన షేర్ల బదిలీ ప్రక్రియ పూర్తయింది. దీంతో మెట్రో నిర్వహణ, ప్రణాళికలు ఇకపై పూర్తిగా ప్రభుత్వ…

Read Full News

రికార్డ్ టెన్త్ ఫలితాలు.. 95% పాస్.. ములుగు టాప్.. 6 ప్రైవేట్ స్కూళ్లలో జీరో రిజల్ట్!

రాష్ట్ర 10వ తరగతి ఫలితాలు ఈసారి రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. మొత్తం ఉత్తీర్ణత శాతం 95.15%గా నమోదై విద్యార్థులు సత్తా చాటారు. గత ఏడాదితో పోలిస్తే పాస్ శాతం 2.37% పెరగడం విశేషం. ముఖ్యంగా ప్రభుత్వ గురుకుల పాఠశాలలు మరోసారి అద్భుత ఫలితాలు సాధించి అందరి దృష్టిని ఆకర్షించాయి. అయితే మరోవైపు లక్షల ఫీజులు వసూలు చేసే కొన్ని ప్రైవేట్ పాఠశాలల పరిస్థితి తీవ్ర విమర్శలకు దారితీసింది. రాష్ట్రంలో ఏకంగా ఆరు ప్రైవేట్ స్కూళ్లలో ఒక్క విద్యార్థి…

Read Full News

దక్షిణం నుంచి బెంగాల్ వరకు ఎగ్జిట్ పోల్స్ హీట్.. తమిళనాడులో డీఎంకే, అస్సాంలో బీజేపీ ఆధిక్యం!

దేశ రాజకీయాలను ప్రభావితం చేసే కీలక అసెంబ్లీ ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్ విడుదల కావడంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ మరింత పెరిగింది. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అస్సాం, కేరళ రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి. మే 4న అసలు ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ఎవరి అంచనాలు నిజమవుతాయో అన్న ఆసక్తి నెలకొంది. పశ్చిమ బెంగాల్‌లో హోరాహోరీ పోరు పశ్చిమ బెంగాల్‌లో చివరి దశ…

Read Full News

హైదరాబాద్ ఆత్మ భవనాల్లో కాదు.. సంస్కృతిలో ఉంది” – కేటీఆర్

హైదరాబాద్ అభివృద్ధి, తెలంగాణ ప్రగతి, నగర సంస్కృతి గురించి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌ను ఒక్క వ్యక్తి లేదా ఒక్క నాయకుడు నిర్మించలేదని, ఈ నగరం శతాబ్దాలుగా రూపుదిద్దుకున్న సంస్కృతి, వారసత్వం, ప్రజల జీవన శైలితో ప్రత్యేకత సాధించిందని పేర్కొన్నారు. “హైదరాబాద్‌కు ఘనతను ఒక వ్యక్తికి ఇవ్వలేం. ఈ నగరం ఒక్క రోజులో నిర్మించబడలేదు. రోమ్ ఒక్క రోజులో నిర్మించబడనట్టే హైదరాబాద్ కూడా శతాబ్దాలుగా అభివృద్ధి చెందింది” అని కేటీఆర్ అన్నారు….

Read Full News

ముష్కి చెరువు ఆక్రమణలపై హైడ్రా యాక్షన్.. 10 రోజుల్లో గుడిసెలు తొలగించాలని ఆదేశాలు

హైదరాబాద్ నర్సింగ్ పరిధిలోని ముష్కి చెరువు వద్ద హైడ్రా అధికారులు, ఇరిగేషన్ శాఖ, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. చెరువు పరిధిలో అక్రమంగా ఏర్పాటు చేసిన గుడిసెలు, డంపింగ్ కార్యకలాపాలు, బఫర్ జోన్ ఆక్రమణలపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చెరువు అభివృద్ధి, నీటి నిల్వ సామర్థ్య పరిరక్షణ కోసం చర్యలు చేపడుతున్నామని స్పష్టం చేశారు. అధికారుల వివరాల ప్రకారం ముష్కి చెరువు మొత్తం 52 ఎకరాల ఎఫ్టీఎల్ (FTL) పరిధిలో ఉంది. ఇందులో సుమారు…

Read Full News

నెల అయిందన్నా ఫోన్ చేస్తావా అంటున్నారు.. కనీస సౌకర్యాలు కూడా లేవు” అంటూ ప్రజల ఆవేదన

పరిస్థితి దారుణంగా ఉంది.. నెల అయిందన్నా ఫోన్ చేస్తావా అంటున్నారు. వస్తాం అంటారు కానీ ఎవరూ రావడం లేదు. కనీసం మంచిగా చెప్పినా పట్టించుకోవడం లేదు” అంటూ స్థానిక ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో కనీస సౌకర్యాలు కూడా అందక ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రజలు చెబుతున్న వివరాల ప్రకారం, గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, రోడ్లు దెబ్బతిన్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. సమస్యలపై ఎన్నిసార్లు ఫోన్ చేసినా…

Read Full News

ఫోన్ ట్యాపింగ్ కేసులో ఒరిగేదేం లేదు.. అధికారులనే బలిపశువుల్ని చేస్తున్నారన్న శివకుమార్

తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసుపై యుగ తులసి ఫౌండేషన్ చైర్మన్ శివకుమార్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. మంగళవారం సిట్ విచారణకు హాజరైన అనంతరం మాట్లాడిన ఆయన, ఈ కేసు విచారణ ద్వారా పెద్దగా ఒరిగేదేమీ లేదని ఆరోపించారు. సిట్ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు తాను సమాధానాలు ఇచ్చానని తెలిపారు. శివకుమార్ మాట్లాడుతూ, ఫోన్ ట్యాపింగ్ కేసు అసలు ఉద్దేశం న్యాయం చేయడం కాదని, రాజకీయ కాలయాపన కోసం…

Read Full News

మోయినాబాద్ డ్రగ్స్ కేసులో పుట్టా మహేష్ పేరు ఎందుకు లేదు?.. ఎంపీపై ప్రశ్నలు వెల్లువ

మోయినాబాద్ ఫార్మ్ హౌస్ డ్రగ్స్ కేసు రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సహా పలువురు ఈ కేసులో అరెస్టై జైలుకు వెళ్లగా, ఇప్పుడు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పేరు బయటకు రావడం మరింత సంచలనంగా మారింది. ముఖ్యంగా ఆయనకు డ్రగ్స్ టెస్ట్‌లో పాజిటివ్ వచ్చినట్టు జాతీయ మీడియా కథనాలు వెలువడటంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ మొదలైంది. జాతీయ పత్రిక “ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్”…

Read Full News

తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్.. రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ

తెలంగాణ రాష్ట్ర కొత్త డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)గా సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం డీజీపీగా ఉన్న శివధర్ రెడ్డి రేపు పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో, ఆయన స్థానంలో 1991 బ్యాచ్‌కు చెందిన సీవీ ఆనంద్ ఎల్లుండి బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న సీవీ ఆనంద్‌కు శాంతిభద్రతల నిర్వహణలో విశేష అనుభవం ఉంది….

Read Full News

కవిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్ మౌనం.. కేసీఆర్ వ్యూహమా లేక అంతర్గత గందరగోళమా?

కల్వకుంట్ల కవిత ఇటీవల నిర్వహించిన కొత్త పార్టీ ప్రారంభోత్సవ సభలో చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ శ్రేణుల్లో కలకలం రేపాయి. గ్రామ స్థాయి కార్యకర్తల నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు చాలా మంది లోలోపల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నప్పటికీ, బహిరంగంగా మాత్రం ఎవరూ స్పందించకపోవడం ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. కవిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్‌కు చెందిన కీలక నేతలు…

Read Full News