News
వెండి కిలో ₹4 లక్షలు… బంగారం ₹67 వేలు: మధ్యతరగతికి అందని ధరలు
గత కొన్ని రోజులుగా దేశంలో బంగారం, వెండి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా వెండి ధర కిలోకు రూ.4 లక్షలకు చేరిందంటే పరిస్థితి ఎంత తీవ్రమైందో అర్థం చేసుకోవచ్చు. కేవలం 28 రోజుల్లోనే వెండి ధర దాదాపు రూ.1.44 లక్షలు పెరగడం మార్కెట్‌ను షాక్‌కు గురి చేసింది. మరోవైపు బంగారం కూడా ఒక్కరోజులోనే రూ.13,000కుపైగా పెరిగి తులానికి రూ.67,000 మార్క్‌ను దాటింది. ఈ ధరల పెరుగుదలతో బంగారం కాయిన్లు, బిస్కెట్లు మార్కెట్లో అందుబాటులో లేకుండా పోతున్నాయి. డిమాండ్…
22 వేల పెట్టుబడితో 22 లక్షల ఆదాయమా? ఫేక్ ఏఐ వీడియోలతో కొత్త సైబర్ మోసాలు
పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో వేల సంఖ్యలో ఫేక్ వీడియోలు వైరల్ అవుతుండటం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈజీ మనీ పేరుతో అమాయకులను మోసం చేయడమే లక్ష్యంగా సైబర్ కేటుగాళ్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో ప్రముఖుల ఫేక్ వీడియోలు, వాయిస్‌లను సృష్టిస్తూ ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్, కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మాట్లాడుతున్నట్లుగా ఫేక్ వీడియోలను రూపొందించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఈ…
సొంత ఇంటికి తిరిగొచ్చా”: రాజకీయ మోసాలు, అంతర్గత కుట్రల మధ్య నేత ఆవేదన
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో జరిగిన కార్యక్రమంలో భారీ చప్పట్ల మధ్య తన రాజకీయ ప్రయాణంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన నేత, తన బయటికివెళ్లడానికి గల కారణాలను బహిరంగంగా వెల్లడించారు. రాజకీయంగా ఎదగకుండా చేయడానికి కొందరు నాయకులు తనపై, ఇతరులపై బురదజల్లారని, ముఖ్యంగా వరంగల్ జిల్లాలో కుట్రపూరిత రాజకీయాలు నడిచాయని ఆరోపించారు. వరంగల్ జిల్లాలో అనేకమంది నాయకుల ఎదుగుదలను అడ్డుకున్న వ్యక్తిగా కడియం శ్రీహరి పేరును ప్రస్తావిస్తూ, ఎన్నికల ముందు రేవంత్ రెడ్డితో రహస్య…
దానం నాగేంద్ర యూ–టర్న్: రాజీనామా భయం, అఫిడివిట్ డ్రామా, అనర్హత వేటకు తప్పించుకునే ప్రయత్నమా?
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర వ్యవహారం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఒక నెల క్రితం తాను కాంగ్రెస్ ఎమ్మెల్యేనని బహిరంగంగా ప్రకటించిన దానం, తాజాగా మాత్రం “నేను ఇంకా బిఆర్ఎస్‌లోనే ఉన్నాను” అంటూ స్పీకర్‌కు అఫిడివిట్ ఇవ్వడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. ఇది సాధారణ యూ–టర్న్ కాదు… ఇది రాజీనామా భయంతో తీసుకున్న రాజకీయ వెనకడుగుగా కనిపిస్తోంది. క్షేత్ర స్థాయిలో పరిస్థితులు దానంకు అనుకూలంగా లేవన్న ప్రచారం బలంగా…
ఆటో డ్రైవర్ల సమస్యలపై రాజకీయ నాటకాలు: కవిత స్టేట్‌మెంట్లలో స్పష్టత ఎక్కడ?
ఇటీవలి కాలంలో కల్వకుంట్ల కవిత ఇచ్చే స్టేట్‌మెంట్లు పూర్తిగా గందరగోళంగా మారాయి.ఒకవైపు “బీజేపీకి తెలంగాణలో స్థానం లేదు” అంటారు, మరోవైపు ఆటో డ్రైవర్లకు “రూ.12,000 ఇవ్వండి” అంటూ సడన్‌గా డిమాండ్ పెడతారు. పైగా ఇతర జిల్లాల ఆటోలను హైదరాబాద్‌లోకి రానివ్వొద్దంటూ వ్యాఖ్యలు చేస్తారు. ఈ స్టేట్‌మెంట్లన్నీ చూస్తే రాజకీయంగా ఎదగాలనే తొందర తప్ప, సమస్యలపై స్పష్టత కనిపించడం లేదు. గత పదేళ్లుగా ఆటో డ్రైవర్ల సమస్యలపై మాట్లాడని వారు, ఇప్పుడు ఒక్కసారిగా రూ.12,000 అంశాన్ని ముందుకు తేవడం…
లిక్కర్ స్కామ్ ఆరోపణలున్న కవితకు కాంగ్రెస్‌లో చోటు లేదు: మధు యాష్కి గౌడ్ స్పష్టం
లిక్కర్ స్కామ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న కల్వకుంట్ల కవితను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే ప్రసక్తే లేదని టీపీసీసీ క్యాంపెయినింగ్ కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ స్పష్టం చేశారు. బుధవారం గాంధీ భవన్‌లో మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలు ప్రాణత్యాగాలు చేసి ఉద్యమం చేస్తే, అదే సమయంలో కేసీఆర్ కుటుంబ సభ్యులు — కేసీఆర్, హరీష్ రావు, కవిత — 2010లోనే అమెరికాలో కంపెనీలు పెట్టుకున్నారని మధు యాష్కి…
అనర్హత పిటిషన్లపై స్పీకర్ తీరు వివాదాస్పదం: న్యూట్రాలిటీపై రాజకీయ వర్గాల్లో ప్రశ్నలు
తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ క్రమంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వ్యవహరిస్తున్న తీరుపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. స్పీకర్ న్యూట్రల్‌గా వ్యవహరించాల్సిన సందర్భంలో ఆయన తీరు ఒక పక్షానికే అనుకూలంగా ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీఆర్ఎస్ తరఫున కాంగ్రెస్‌లో చేరినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై స్పీకర్ విచారణ చేపట్టి ఎనిమిది మంది ఎమ్మెల్యేల…
అంగరంగ వైభవంగా మేడారం జాతర తొలి ఘట్టం: గద్దెపైకి చేరుకున్న సార్లమ్మ
లక్షలాది మంది భక్తుల ఎదురుచూపుల నడుమ మేడారం మహాజాతర తొలి ఘట్టం ప్రశాంతంగా ముగిసింది. బుధవారం ఆదివాసీ సంప్రదాయాల మధ్య సార్లమ్మ గద్దెపైకి చేరడంతో జాతర ఉత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. కన్నేపల్లిలోని సార్లమ్మ గుడి నుంచి బుధవారం సాయంత్రం 7 గంటల 38 నిమిషాలకు సార్లమ్మ బయలుదేరగా, జంపన్న వాగు వద్దకు రాత్రి 8 గంటల 48 నిమిషాలకు చేరుకుంది. అక్కడి నుంచి అశేష భక్తజనం మధ్య ఊరేగింపుగా తీసుకెళ్లి మేడారంలో గద్దెపై ప్రతిష్ఠించారు. ఈ ఘట్టానికి…
ప్రేమ వివాహానికి అడ్డుగా ఉన్న తల్లిదండ్రుల హత్య: యాచారం గ్రామంలో కూతురు చేతిలోనే డబుల్ మర్డర్
యాచారం గ్రామానికి చెందిన నక్కలి అశోక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదైన కేసు సంచలన విషయాలను వెలుగులోకి తెచ్చింది. అప్పుల బాధతో తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకున్నారనే మొదటిప్రాథమిక సమాచారం అనుమానాస్పదంగా మారడంతో పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు. ఫిర్యాదులో భాగంగా బంటవరం ఎస్ఐ, దారూర్ సీఐలు సంఘటన స్థలానికి వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించగా అక్కడ రెండు ఇంజెక్షన్లు లభ్యమయ్యాయి. దీంతో ఇది సాధారణ మృతి కాదని భావించిన పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు…
పచ్చి అబద్ధాలతో వ్యక్తిత్వ హననం: నమస్తే తెలంగాణ, కేటీఆర్, హరీష్ రావుపై కాంగ్రెస్ నేత ఫిర్యాదు
పచ్చి అబద్ధాలతో తనపై మరియు కాంగ్రెస్ పార్టీపై కుట్రపూరితంగా బురద జల్లే ప్రయత్నం చేశారని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ నేత నార్సింగ్ పోలీస్ స్టేషన్‌లో అధికారికంగా ఫిర్యాదు చేశారు. జేసీబీ ఓనర్ల మధ్య జరిగిన చిన్న ఘటనను వక్రీకరించి, తనపై రూ.8 కోట్ల డిమాండ్ చేసినట్లు తప్పుడు కథనం ప్రచురించారని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ నెల మొదటి వారంలో జరిగిన ఒక సంఘటనను ఆసరాగా తీసుకుని, టీఆర్‌ఎస్ (బీఆర్‌ఎస్) పార్టీకి చెందిన నమస్తే తెలంగాణ పత్రికలో…

