News
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో దొంగ ఓటు కలకలం — మహిళా ఓటర్ ఆవేదన
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికలో ఓటింగ్ ప్రశాంతంగా సాగుతుందని భావించిన వేళ, ఒక దొంగ ఓటు ఘటన కలకలం రేపింది. పోలింగ్ బూత్ నంబర్ 67లో జరిగిన ఈ ఘటన ఎన్నికల వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఒక మహిళా ఓటర్ తన ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రానికి రాగా, ఇప్పటికే ఆమె పేరుతో ఓటు వేసినట్లు అధికారులు తెలియజేశారు. దీనిపై ఆ మహిళా ఓటర్ ఆవేదన వ్యక్తం చేస్తూ, “నా ఓటు వేరే వ్యక్తి వేసేశాడు, ఇది ఎలా…
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఉద్రిక్తత — పరస్పరం ఫిర్యాదులతో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య వాగ్వాదం
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలో పోలింగ్ మందకొడిగా కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 31.94 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం నుంచే కొన్ని కేంద్రాల్లో ఓటర్లు పెద్ద సంఖ్యలో హాజరైనప్పటికీ, తర్వాత వేళల్లో ఓటింగ్ వేగం తగ్గింది.ఇదే సమయంలో, ఎన్నికల వేడిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పరస్పర ఆరోపణలు తీవ్రతరంగా మారాయి. బీఆర్ఎస్ నేతలపై ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. జూబ్లీహిల్స్ పరిధిలో బీఆర్‌ఎస్ నేతలు, కార్పొరేటర్లు గొడవలకు పాల్పడుతున్నారని, స్థానికేతరులను ప్రచారానికి వినియోగిస్తున్నారని…
అందెశ్రీ అంతిమయాత్రలో సీఎం రేవంత్ రెడ్డి పాడె మోశారు — స్మృతివనం ఏర్పాటు నిర్ణయం
తెలంగాణ రాష్ట్ర గీత రచయిత, కవి అందెశ్రీ (అసలు పేరు: అందె ఎల్లయ్య) ఇక లేరు. సోమవారం ఉదయం లాలాపేట్‌లోని తన నివాసంలో కుప్పకూలిన ఆయనను గాంధీ ఆసుపత్రికి తరలించగా, వైద్యులు మరణించినట్లు ధృవీకరించారు. ఈ వార్తతో తెలంగాణ సాహితీ, సాంస్కృతిక రంగాలన్నీ దుఃఖంలో మునిగిపోయాయి. అందెశ్రీ అంతిమయాత్రలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. లాలాపేట్ నుంచి ఘట్‌కేసర్ వరకు సాగిన అంతిమయాత్రలో ప్రజలు, అభిమానులు, కవులు కన్నీరుమున్నీరయ్యారు….
దేశంలో తొలిసారి ఎన్నికల్లో డ్రోన్ల వినియోగం — జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో టెక్ సెక్యూరిటీ కొత్త అధ్యాయం
ఓటు హక్కు వినియోగించుకున్న కాంగ్రెస్ అభ్యర్థి నవీన్యూసుఫ్‌గూడలో ఓటు వేసిన నవీన్‌యాదవ్, కుటుంబసభ్యులుతండ్రి చిన్న శ్రీశైలం యాదవ్‌తో వచ్చి ఓటేసిన నవీన్ యాదవ్ కాంగ్రెస్‌పై బీజేపీ అభ్యర్థి లంకల దీపక్‌రెడ్డి పలు ఆరోపణలుBJYM కార్యకర్తలపై కాంగ్రెస్ నేతలు దాడికి దిగారుఎన్నికలకు ముందే దాడులు చేస్తున్నారు – దీపక్‌రెడ్డిఈవీఎంలో సీరియల్ నెంబర్ 1 సరిగ్గా లేదుఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లాం – దీపక్‌రెడ్డి నాన్ లోకల్ నేతలపై ఎన్నికల సంఘం సీరియస్‌ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పోలింగ్‌బూత్‌కు రావడంపై ఆగ్రహంఓటర్లను ప్రభావితం…
దేశంలో తొలిసారి ఎన్నికల్లో డ్రోన్ల వినియోగం — జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో టెక్ సెక్యూరిటీ కొత్త అధ్యాయం
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికలో ఈసారి ఓ కొత్త సాంకేతిక ప్రయోగం జరిగి దేశవ్యాప్తంగా దృష్టి ఆకర్షిస్తోంది. దేశంలో తొలిసారిగా ఎన్నికల పర్యవేక్షణకు డ్రోన్లను వినియోగించడం విశేషం. ఎన్నికల వ్యవస్థలో టెక్నాలజీని వినియోగించి పారదర్శకత, భద్రతను పెంపొందించాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి, అన్ని డ్రోన్లను లైవ్ ఫీడ్‌తో అనుసంధానం చేశారు. డ్రోన్లు నిరంతరం ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద పరిస్థితులను…
దేశంలో తొలిసారి ఎన్నికల్లో డ్రోన్ల వినియోగం — జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో టెక్ సెక్యూరిటీ కొత్త అధ్యాయం
దేశంలో మొదటిసారి ఎన్నికల్లో డ్రోన్స్..జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌కు డ్రోన్లతో అనుసంధానందేశంలో మొదటిసారి ఎన్నికల్లో డ్రోన్స్ ఉపయోగం..పోలింగ్ బూత్‌ల వద్ద డ్రోన్లతో పర్యవేక్షణఎప్పటికప్పుడు డ్రోన్ విజ్యువల్స్‌ను పర్యవేక్షిస్తున్న సిబ్బంది..ప్రతి పోలింగ్ లొకేషన్‌కి ఒక డ్రోన్.. 139 పోలింగ్ లొకేషన్స్‌లో 139 డ్రోన్లు..డ్రోన్లు ఎగిరేయడానికి DGCA, లోకల్ పోలీసుల నుంచి పెర్మిషన్ తీసుకున్న ఎన్నికల అధికారులు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికలో ఈసారి ఓ కొత్త సాంకేతిక ప్రయోగం జరిగి దేశవ్యాప్తంగా దృష్టి ఆకర్షిస్తోంది. దేశంలో…
సింపతీ, సెంటిమెంట్స్ వద్దు..నియోజకవర్గం అభివృద్ధి కోసం చాలా జాగ్రత్తగా ఓటెయ్యండి- నవీన్ యాదవ్
మీ భవిష్యత్ గురించి ఓటెయ్యండి- నవీన్ యాదవ్ జూబ్లీహిల్స్ నియోజకవర్గ వివరాలు: మొత్తం ఓటర్లు: 4,01,635పురుషులు: 2,08,561మహిళలు: 1,92,779ఇతరులు: 25పోలింగ్ కేంద్రాలు: 407సమస్యాత్మక కేంద్రాలు: 226పోలింగ్ సిబ్బంది: 2,060పోలీసు సిబ్బంది (రిజర్వ్‌తో కలుపుకొని): 2,394బ్యాలెట్ యూనిట్లు: 561వీవీ ప్యాట్ యంత్రాలు: 595పోటీదారులు: 58
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఉత్సాహభరిత పోలింగ్ — డ్రోన్ల పర్యవేక్షణలో భద్రతా చర్యలు కఠినం
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన ఉప ఎన్నిక పోలింగ్ ఉత్సాహంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ ప్రక్రియ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. ఎన్నికల ప్రక్రియలో ఐదువేల మంది సిబ్బంది విధుల్లో ఉన్నారు. పోలింగ్ ప్రారంభమైన కొద్ది సేపటికే ఓటర్లు భారీగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. ఉదయం వేళల్లోనే పెద్ద సంఖ్యలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం గమనార్హం. ఈసారి పోలింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం (ఈసీ) ప్రత్యేక ప్రణాళికలు…
షేక్‌పేట్‌లో ఓటు హక్కు వినియోగించిన రాజమౌళి దంపతులు
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో జరుగుతున్న ఉపఎన్నికలో పోలింగ్ ఉత్సాహంగా కొనసాగుతోంది. సాధారణ ప్రజలతో పాటు సినీ రంగ ప్రముఖులు కూడా ప్రజాస్వామ్య పండుగలో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తన భార్య రమతో కలిసి షేక్‌పేట్ డివిజన్ పరిధిలోని ఒక ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి విచ్చేసి తమ ఓటు హక్కును వినియోగించారు. రాజమౌళి దంపతులు ఎలాంటి ఆర్భాటం లేకుండా సాధారణ ఓటర్ల మాదిరిగానే క్యూలో నిలబడి ఓటు వేశారు….

