News
ఫిబ్రవరి 12న మున్సిపల్ ఎన్నికలు వద్దు: ఎన్నికల సంఘానికి కార్మిక సంఘాల వినతిఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనర్ అనర్హుడంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలు
రాష్ట్రంలో ఫిబ్రవరి 12న మున్సిపల్ ఎన్నికలు నిర్వహించవద్దని పలు కార్మిక సంఘాలు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరాయి. నాలుగు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా, విద్యుత్ సవరణ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని, పాత ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని, జాతీయ విత్తన బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అదే రోజున దేశవ్యాప్తంగా కార్మికులు సర్వసాధారణ సమ్మెకు పిలుపునిచ్చినట్లు సంఘాల నాయకులు తెలిపారు. ఫిబ్రవరి 12న మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయన్న ప్రచారాలు మీడియాలో వస్తుండటంతో, వాటిని రాష్ట్ర ఎన్నికల సంఘం…
ఫిబ్రవరి 12న మున్సిపల్ ఎన్నికలు నిర్వహించవద్దు: రాష్ట్ర ఎన్నికల సంఘానికి కార్మిక సంఘాల వినతి
రాష్ట్రంలో ఫిబ్రవరి 12న మున్సిపల్ ఎన్నికలు నిర్వహించవద్దని పలు కార్మిక సంఘాలు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరాయి. నాలుగు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా, విద్యుత్ సవరణ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని, పాత ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని, జాతీయ విత్తన బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అదే రోజున దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు సర్వసాధారణ సమ్మెకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 12న ఎన్నికలు నిర్వహిస్తే కార్మికులు, ఉద్యోగులు సమ్మెలో పాల్గొనలేని పరిస్థితి ఏర్పడుతుందని…
మనశంకర్ వరప్రసాద్ సినిమా టికెట్ ధరల వ్యవహారం: జీఎస్టి అధికారులకు హైకోర్టు కీలక ఆదేశాలు
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అంతర్గత అసంతృప్తి స్వరాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా క్షేత్రస్థాయిలోకి వెళ్లేందుకు సగం మంది మంత్రులు ఆసక్తి చూపడం లేదన్న ఆరోపణలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. సర్కారుకు అందిన నిఘా వర్గాల నివేదికల ప్రకారం, మున్సిపల్ ఎన్నికలపై మంత్రుల నిర్లక్ష్యం పార్టీకి ఇబ్బందికరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో సినిమా టికెట్ ధరల పెంపుపై మరోసారి హైకోర్టు గట్టి చర్యలకు దిగింది. మనశంకర్ వరప్రసాద్‌కు సంబంధించిన సినిమా టికెట్…
మున్సిపల్ ఎన్నికలపై మంత్రుల అనాశక్తి: క్షేత్ర స్థాయికి దూరంగా కాంగ్రెస్ ప్రభుత్వం?
తెలంగాణలో రాబోయే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై అసంతృప్తి స్వరాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా మంత్రుల అనాశక్తి, క్షేత్ర స్థాయికి వెళ్లేందుకు ఆసక్తి లేకపోవడం పార్టీకి పెద్ద సవాలుగా మారిందన్న నివేదికలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రభుత్వానికి అందిన నిఘా వర్గాల నివేదికల ప్రకారం, లోక్‌సభ నియోజకవర్గాల వారిగా ఇంచార్జీలుగా నియమించిన మంత్రుల్లో సగం మంది ఇప్పటికీ ఫీల్డ్‌లోకి అడుగుపెట్టలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నెల 18న మేడారంలో జరిగిన క్యాబినెట్ సమావేశం తర్వాత మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లపై…
ఫోన్ ట్యాపింగ్ కేసులో డేటా ధ్వంసం మిస్టరీ: కేటీఆర్‌పై ప్రశ్నల వర్షం, విచారణపై సందేహాలు
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరోసారి కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధానంగా డేటా ధ్వంసం వెనుక ఎవరి ఆదేశాలు ఉన్నాయి? అనే అంశం ఇప్పుడు వార్తల్లో ప్రధానంగా చర్చకు వస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఎస్ఎస్ఐబి కార్యాలయంలోని హార్డ్ డిస్క్‌ల డేటాను ఎందుకు ధ్వంసం చేశారన్న ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ఎదుట విచారణకు హాజరైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై అధికారులు ప్రశ్నల వర్షం…
ఫోన్ ట్యాపింగ్ కేసు పేరుతో రాజకీయ సీరియల్: ఆరోపణలు మాత్రమే, అరెస్టులు శూన్యం
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు మరోసారి రాజకీయ దుమారానికి దారి తీసింది. ఒకవైపు కేంద్ర మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేస్తుండగా, మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ విచారణను పూర్తిగా రాజకీయ పంచాయతీగా అభివర్ణించారు. ఆధారాలు ఉన్నాయని చెబుతున్నప్పటికీ ఇప్పటివరకు ఒక్క కీలక అరెస్టు కూడా జరగలేదని ఇరు పక్షాలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో తనను విచారణకు పిలిచారని, దాదాపు ఏడు నుంచి ఎనిమిది…
ఫోన్ ట్యాపింగ్ నుంచి కాళేశ్వరం వరకు: ట్రెండింగ్ టాపిక్‌లకే పరిమితమైన తెలంగాణ రాజకీయాలు
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన సంచలన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. సిరిసిల్ల కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, జడ్జీలు, వ్యాపారులు, సినీ ప్రముఖుల ఫోన్లను కూడా ట్యాప్ చేశారన్న ఆరోపణలు చేసిన ఆయన, అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఒక్క కీలక అరెస్టు కూడా జరగలేదని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో SIT విచారణ సీరియల్‌లా అంతం లేకుండా…
సిట్ విచారణను డైవర్షన్ చేయడానికి బావ–బామర్దుల డ్రామా: కేటీఆర్, హరీష్ రావుపై తీవ్ర విమర్శలు
మాజీ మంత్రి కేటీఆర్‌ను సిట్ అధికారులు విచారణకు పిలిచిన నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు, ప్రెస్‌మీట్‌లు పూర్తిగా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమేనని కాంగ్రెస్ నేతలు తీవ్రంగా విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు ఇప్పటికే స్పష్టమైన ఆధారాలతో పలువురు అధికారులను నిందితులుగా గుర్తించి జైలుకు పంపిన విషయాన్ని గుర్తు చేశారు. కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు—సిట్ విచారణ ఎదురైన ప్రతీసారి వీరు జైతయాత్రకు వెళ్లినట్లుగా ప్రెస్‌మీట్‌లు పెట్టి, స్వయంగా డబ్బాలు కొట్టుకుంటూ తెలంగాణ…
ఫోన్ ట్యాపింగ్ కేసు డ్రామా, బిఆర్ఎస్ లోపలి కుట్రలు: కవిత గారి ప్రభావంపై శ్రీకాంత్ గౌడు సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ కేసు మరోసారి కలకలం రేపుతోంది. ఓకే టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలంగాణ జాగృతి నాయకుడు శ్రీకాంత్ గౌడు, బిఆర్ఎస్ లోపలి రాజకీయాలు, కవిత గారి పాత్ర, అలాగే కేటీఆర్‌కు వచ్చిన సిట్ నోటీసులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసు పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైన డైవర్షన్ డ్రామా అని ఆయన ఆరోపించారు. హరీష్ రావు–రేవంత్ రెడ్డి మధ్య లోపాయకర మైత్రి ఉందని, బిఆర్ఎస్‌ను నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా ఈ…
పోలీస్ భయభ్రాంతులు, రాజకీయ కుట్రలు ఫలించవు: బిఆర్ఎస్ నాయకుల హెచ్చరిక
ఈరోజు తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైనవని బిఆర్ఎస్ నాయకులు తీవ్రంగా విమర్శించారు. వేలాది మంది పోలీసులను రోడ్లపైకి దించి, హైదరాబాద్ ప్రజలను, బిఆర్ఎస్ కార్యకర్తలను అనవసరంగా ఇబ్బందులకు గురి చేయడం క్రిమినల్ నెగ్లిజెన్స్‌తో పాటు క్రిమినల్ వేస్ట్ ఆఫ్ పబ్లిక్ రిసోర్సెస్ అని వారు ఆరోపించారు. తప్పు చేయని వాళ్లు భయపడాల్సిన అవసరం లేదని, ఈ కేసులన్నీ పూర్తిగా రాజకీయ కోణంలో రూపొందించిన కుట్రలేనని స్పష్టం చేశారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా…

