టాలెంటెడ్ హీరో అడివి శేష్ ప్రస్తుతం వరుస క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఆయన చేతిలో ఉన్న రెండు ముఖ్యమైన సినిమాలు డెకాయిట్ మరియు గూఢచారి 2. ఈ రెండింటిలో ముందుగా ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం డెకాయిట్. షానియల్ డియో దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ రొమాంటిక్ రివెంజ్ డ్రామాగా రూపొందుతోంది.
ఇప్పటికే విడుదలైన డెకాయిట్ టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ సినిమాలో అడివి శేష్ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తోంది. వాస్తవానికి డెకాయిట్ గత డిసెంబర్లోనే విడుదల కావాల్సి ఉండగా, షూటింగ్ ఆలస్యం కారణంగా మార్చి 19కి వాయిదా పడింది.
తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డెకాయిట్‌లో హీరోయిన్గా నటిస్తున్న మృణాల్ ఠాకూర్, సినిమా చివరి షెడ్యూల్ పూర్తి చేయడానికి హైదరాబాద్‌కు వెళ్తున్నట్టు తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో వెల్లడించారు. ఈ అప్డేట్తో డెకాయిట్ షూటింగ్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్టు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా, ఈ సినిమాలో అనురాగ్ కశ్యప్ కీలక పాత్రలో నటిస్తూ టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తుండటం విశేషం. మొదట ఈ మూవీకి శృతి హాసన్‌ను హీరోయిన్గా ఎంపిక చేసి కొంత షూటింగ్ కూడా చేశారు. అయితే ఆమె సినిమా నుంచి తప్పుకోవడంతో మృణాల్ ఠాకూర్‌ను రీప్లేస్ చేశారు మేకర్స్.
డెకాయిట్ సినిమాలో ప్రకాష్ రాజ్ కూడా ఓ ముఖ్యమైన పాత్రలో నటించనున్నట్లు సమాచారం. తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సుప్రియ యార్లగడ్డ, సునీల్ నారంగ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. డెకాయిట్ పూర్తయితే వెంటనే గూఢచారి 2పై పూర్తి ఫోకస్ పెట్టేందుకు అడివి శేష్ రెడీ అవుతున్నట్టు టాలీవుడ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది.

