93 ఎకరాల చెరువుపై 350 ఎకరాల కబ్జా?అమీన్‌పూర్ పెద్ద చెరువు చుట్టూ వెట్లాండ్–ఎఫ్టీఎల్ వివాదం

తెలంగాణలోని అమీన్‌పూర్ పెద్ద చెరువు చుట్టూ తీవ్ర వివాదం కొనసాగుతోంది. అధికారికంగా చెరువు విస్తీర్ణం 93 ఎకరాలు మాత్రమేనని రికార్డులు చెబుతున్నప్పటికీ, ప్రస్తుతం చెరువుకు సంబంధం లేని 350 ఎకరాలకు పైగా భూమిని వెట్లాండ్–ఎఫ్టీఎల్ పేరుతో కబ్జా చేసినట్లు భూ యజమానులు ఆరోపిస్తున్నారు.

చెరువుకు అడ్డంగా సుమారు 3 మీటర్ల ఎత్తులో భారీ కట్ట నిర్మించడంతో, డ్రై ల్యాండ్‌గా ఉన్న ప్రాంతాల్లోకి నీళ్లు మళ్లించారని బాధితులు చెబుతున్నారు. ఈ నీరు సాధారణ వర్షపు నీరు కాకుండా, బాచుపల్లి పరిసరాల్లోని ఫార్మా పరిశ్రమలు (అరవింద్ ఫార్మా తదితరాలు) విడుదల చేస్తున్న కెమికల్ వాటర్, అలాగే రెసిడెన్షియల్ డ్రైనేజ్ మురుగు నీరని ఆరోపణలు ఉన్నాయి.

అలుగు మూసివేత – వరదల మూలం

చెరువుకు సహజంగా ఉండాల్సిన ప్రాపర్ అలుగు (అవుట్ ఫ్లో చానల్) ను పూర్తిగా మూసివేశారని, తంబి చెరువు వైపు ఉండాల్సిన చైన్ లేకు వ్యవస్థను ధ్వంసం చేశారని స్థానికులు చెబుతున్నారు. దాని బదులు తాత్కాలికంగా ఏర్పాటు చేసిన చిన్న కాలువను అలుగు అని చెబుతూ అధికార యంత్రాంగం తప్పుదారి పట్టిస్తోందని విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇన్ఫ్లూయెన్స్ ఉన్నవారికి మినహాయింపా?

అలుగులపై, నాలాలపై, చెరువు పరిధిలోనే వందల సంఖ్యలో ఇళ్లు, భారీ అపార్ట్‌మెంట్లు నిర్మించినా వాటిపై చర్యలు లేకపోవడం అనుమానాలకు దారితీస్తోంది. మున్సిపల్ కమిషనర్ సుజాత హయాంలోనే 1000–1200 అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు NGTకి నివేదిక ఇచ్చినప్పటికీ, ఒక్క నిర్మాణంపైనా చర్యలు తీసుకోలేదని ఆరోపణలు ఉన్నాయి.

అదే సమయంలో, రాజకీయ ప్రభావం లేని మధ్యతరగతి, రిటైర్డ్ ఉద్యోగులు కొనుగోలు చేసిన 200 గజాల ప్లాట్లను మాత్రం ఎఫ్టీఎల్ పేరుతో బ్లాక్ చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 15–20 ఏళ్లుగా టాక్సులు చెల్లిస్తున్న ఇళ్లకైనా అనుమతులు ఇవ్వకపోవడం వల్ల లోన్లు ఆగిపోవడం, ఆస్తులు అమ్ముకోలేని పరిస్థితి నెలకొందని చెబుతున్నారు.

చరిత్ర ఏమంటోంది?

రికార్డుల ప్రకారం:

  • పెద్ద చెరువు ID: 1200/33
  • కొత్త చెరువు ID: 1200/34
  • 1997 వాటర్ బాడీస్ మీటింగ్‌లోనూ చెరువు విస్తీర్ణం స్పష్టంగా ఉంది
  • 2017 జాయింట్ ఇన్స్పెక్షన్ & Memories of Lake ప్రకారం కూడా 93 ఎకరాలే FTL
  • 2019లో సింగిల్ బెంచ్ తీర్పు కూడా అదే స్పష్టం చేసింది

అయినా, ఇప్పుడు 450 ఎకరాల వరకు ఎఫ్టీఎల్/బఫర్ జోన్గా చూపించడం చట్టబద్ధతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.

ప్రజల డిమాండ్లు ఏమిటి?

ధర్ణాలో ఉన్న భూ యజమానుల ప్రధాన డిమాండ్లు:

  1. ఫార్మా పరిశ్రమల నుంచి వచ్చే కెమికల్ వాటర్ ఇన్‌ఫ్లోను వెంటనే డైవర్ట్ చేయాలి
  2. చెరువుకు సహజ అలుగును తిరిగి ఓపెన్ చేయాలి
  3. రెండు చెరువులపై సమగ్ర సర్వే చేసి నిజమైన FTL నిర్ధారించాలి
  4. అక్రమ నిర్మాణాలపై ఎటువంటి వివక్ష లేకుండా చర్యలు తీసుకోవాలి
  5. చెరువును మురుగు కుంటగా మార్చకుండా సుందరీకరణ చేయాలి
  6. రంగనాథ్ కమిటీపై ఆశలు
  7. రంగనాథ్ గారు ఈ అంశాన్ని లోతుగా అధ్యయనం చేసి “ఒరిజినల్ 93 ఎకరాలే సరైనవి” అని చెప్పడం తమకు కొంత ఆశ కలిగించిందని బాధితులు అంటున్నారు. అయితే, రెవెన్యూ–మున్సిపల్–ఇరిగేషన్ శాఖల మధ్య సమన్వయ లోపం వల్ల ప్రక్రియ ఆలస్యం అవుతోందన్న అనుమానం వ్యక్తమవుతోంది.
  8. ప్రభుత్వానికి సవాల్
  9. ఒకవైపు చెరువుల సుందరీకరణ పేరుతో అభివృద్ధి జరుగుతుంటే, మరోవైపు ఇదే చెరువు చుట్టూ ప్రజలు తమ భూములు పేపర్లకే పరిమితం అయ్యాయని వాపోతున్నారు.
  10. “93 ఎకరాల చెరువుకు 400 ఎకరాల ఎఫ్టీఎల్ ఎలా?” అన్న ప్రశ్నకు ఇప్పటికీ స్పష్టమైన సమాధానం లేదు.
  11. ఇప్పుడు బాల్ మొత్తం ప్రభుత్వ కోర్టులోనే ఉంది.
  12. నిజమైన సర్వే, పారదర్శక నిర్ణయాలే ఈ వివాదానికి ముగింపు పలుకుతాయా?
  13. లేదా ఆలస్యం ఇంకా కొనసాగుతుందా అన్నది చూడాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *