బీసీ రిజర్వేషన్లపై బంద్ పిలుపు – బీజేపీ నిర్ణయంపై తీవ్ర ఆవేదన

రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల అంశం మళ్లీ రాజకీయ వేడిని రేపింది. తెలంగాణ ప్రభుత్వం 42% రిజర్వేషన్ల బిల్లు ఆమోదించినప్పటికీ, కేంద్రం వద్ద ఆ బిల్లు ఆగిపోవడం బీసీ సంఘాలను ఆవేదనకు గురి చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని యావత్ ఓబీసీ సంఘాలు రేపు బంద్‌కు పిలుపునిచ్చాయి.

వీరు పేర్కొంటూ — “మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఈ బిల్లును అడ్డుకుంటోంది. ఇది ఓబీసీల ఆగవాగానికి దారితీస్తుంది. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా రేపు అందరూ బంద్‌లో పాల్గొనాలి” అని విజ్ఞప్తి చేశారు.

అలాగే బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, సంజయ్, రామచంద్రరావు లను ఉద్దేశించి మాట్లాడుతూ — “మీ రాష్ట్రం నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు. అయితే ఎందుకు ఈ బిల్లు పార్లమెంట్‌లో పెట్టలేకపోతున్నారు? ఎందుకు ఓబీసీల హక్కులను అడ్డుకుంటున్నారు?” అని ప్రశ్నించారు.

ముఖ్యమంత్రి పిలుపునిచ్చిన అఖిలపక్ష సమావేశానికి ప్రధానమంత్రి సహకరించాలని కూడా విజ్ఞప్తి చేశారు. “ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నారు. మీరు ముందుకు రండి, మేము వెనక వస్తాం. కానీ బీసీల హక్కులను అడ్డుకోవద్దు” అని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *