ట్రేడింగ్–డిజిటల్ అరెస్ట్ పేరుతో భారీ సైబర్ మోసాలు: ₹3.46 కోట్లు కొట్టేసిన ముఠా, 4 మంది అరెస్ట్

🔴 సైబర్ మోసాలు: వారం రోజుల్లో 14 కేసులు – 23 మంది అరెస్ట్

సైబర్ క్రైమ్ పోలీసులు భారీ ఆన్‌లైన్ మోసాలను చేధించారు. వారం రోజుల వ్యవధిలో 14 కేసులు నమోదు చేసి 23 మందిని అరెస్ట్ చేశారు.

📌 కేసు–1: ట్రేడింగ్ / IPO పేరుతో ₹2.90 కోట్ల మోసం

  • నకిలీ వాట్సాప్ గ్రూపులు, ట్రేడింగ్ యాప్స్ ద్వారా మోసం
  • Alpha Alliance Investment Club” పేరుతో నకిలీ ప్లాట్‌ఫామ్
  • వర్చువల్ లాభాలు, నకిలీ IPO కేటాయింపులు చూపించి మభ్యపెట్టారు
  • బాధితుడి నుంచి ₹2,90,04,585 యూపీఐ, బ్యాంకు ఖాతాల ద్వారా వసూలు
  • బ్యాంక్ ఖాతాలు అందించినందుకు శ్రీకాంత్, శివకాంత్ రాజు, సూర్యభగవాన్ అరెస్ట్
  • ప్రధాన నిందితుడు అనిల్ గోయల్ పరారీలో

📌 కేసు–2: “డిజిటల్ అరెస్ట్” స్కామ్ – 74 ఏళ్ల వృద్ధురాలికి షాక్

  • టెలికాం అధికారులు అంటూ ఫోన్ కాల్స్
  • చట్టపరమైన చర్యలు అంటూ బెదిరింపులు
  • ₹56.50 లక్షలు కాజేసిన మోసగాళ్లు
  • ఈ కేసులో కూడా ఇద్దరు నిందితుల అరెస్ట్

🥛 మదర్ డైరీలో రాజీనామాల పరంపర

  • నల్గొండ–రంగారెడ్డి జిల్లా పాల ఉత్పత్తిదారుల యూనియన్‌లో కలకలం
  • 15 రోజుల క్రితమే చైర్మన్‌గా ఎన్నికైన మందడి ప్రభాకర్ రెడ్డి రాజీనామా
  • ఆరోగ్య సమస్యలే కారణమని వివరణ
  • మదర్ డైరీలో తరచూ చైర్మన్ల రాజీనామాలు జరగడం చర్చనీయాంశం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *