హైదరాబాద్ నగరంలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. నేరేడుమెట్ట ప్రాంతంలో ఏకంగా 20 ఏళ్లుగా నకిలీ డాక్టర్‌గా చెలామణి అవుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన స్థానికులను తీవ్రంగా కలవరపెడుతోంది.
పోలీసుల వివరాల ప్రకారం, ఉత్తరప్రదేశ్‌కు చెందిన రమేష్ అనే వ్యక్తి ఉపాధి కోసం దాదాపు రెండు దశాబ్దాల క్రితం హైదరాబాద్‌కు వచ్చాడు. అయితే కనీసం 10వ తరగతి కూడా పాస్ కాకపోయిన అతడు, నేరేడుమెట్టలో డెంటల్ క్లినిక్ ఏర్పాటు చేసి తనను తాను డాక్టర్‌గా పరిచయం చేసుకున్నాడు.
ఏ విధమైన అర్హతలు లేకపోయినా, 20 ఏళ్లుగా డెంటల్ చికిత్సలు అందిస్తూ అనేక మంది రోగుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టినట్టు పోలీసులు వెల్లడించారు. అతని చికిత్స విధానం కూడా అనుమానాస్పదంగా ఉండేది. ముఖ్యంగా అతడు రాత్రి వేళల్లో మాత్రమే క్లినిక్ నడపడం గమనార్హం. పగటిపూట అనుమానం రాకుండా ఉండేందుకే ఈ విధానాన్ని అనుసరించినట్లు పోలీసులు భావిస్తున్నారు.
స్థానికులకు అతని కార్యకలాపాలపై అనుమానం రావడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రాచకొండ ఎస్ఓటి మరియు మల్కాజగిరి పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి క్లినిక్‌లో తనిఖీలు చేశారు. విచారణలో అతనికి కనీస విద్యార్హతలు కూడా లేవని, నకిలీ డాక్టర్‌గా చెలామణి అవుతున్నాడని తేలింది.
దీంతో రమేష్‌ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటనతో గత 20 ఏళ్లలో అతని చేతిలో చికిత్స పొందిన వారి పరిస్థితి ఏమైందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ సంఘటన ప్రజల్లో ఆందోళన రేకెత్తించింది. వైద్య సేవలు తీసుకునే ముందు వైద్యుల అర్హతలను తప్పనిసరిగా ధృవీకరించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. నకిలీ వైద్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.