జూబిలీ హిల్స్ ఉపఎన్నికల్లో బిఆర్ఎస్ ఆధిక్యం — కాంగ్రెస్ పై 8% మెజారిటీతో గెలుపు అవకాశాలు

జూబిలీ హిల్స్ ఉప ఎన్నికల్లో బిఆర్ఎస్ మరోసారి ఆధిక్యంలో నిలిచినట్లు కేకే సర్వే అండ్ స్ట్రాటజీస్ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. ఈ సర్వే ప్రకారం, బిఆర్ఎస్ పార్టీకి 49% ప్రజా మద్దతు లభించగా, కాంగ్రెస్ పార్టీకి కేవలం 41% ఓట్లు మాత్రమే వచ్చాయి. బిజెపికి 8% మరియు ఇతరులకు 2% మద్దతు నమోదైంది.

కేకే సర్వే ప్రకారం బిఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పై 8% మెజారిటీతో గెలుపు సాధ్యమని అంచనా వేసింది. కేం.చాణక్య, క్యూమేగా వంటి సంస్థల సర్వేలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. బిఆర్ఎస్ గెలుపుకు కేసీఆర్‌పై ప్రజల విశ్వాసం, అభ్యర్థి సునీతకు స్థానిక మద్దతు ప్రధాన కారణాలుగా చెప్పబడుతున్నాయి.

ఎన్నికల సంఘం ప్రకారం జూబిలీ హిల్స్ నియోజకవర్గంలో 48.49% ఓటింగ్ నమోదైంది. 2023లో 47.49% ఓటింగ్ నమోదు కాగా, ఈసారి కేవలం 1% మాత్రమే పెరిగింది. మొత్తం 4,10,365 మంది ఓటర్లలో 1,94,631 మంది మాత్రమే ఓటు హక్కును వినియోగించారు.

ఎన్నికల సంఘం ప్రకారం జూబిలీ హిల్స్ నియోజకవర్గంలో 48.49% ఓటింగ్ నమోదైంది. 2023లో 47.49% ఓటింగ్ నమోదు కాగా, ఈసారి కేవలం 1% మాత్రమే పెరిగింది. మొత్తం 4,10,365 మంది ఓటర్లలో 1,94,631 మంది మాత్రమే ఓటు హక్కును వినియోగించారు.

ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ బెదిరింపుల మధ్య కూడా ఓటర్లు తమ హక్కును వినియోగించారని, ఇది బిఆర్ఎస్ విజయం వైపే దారి తీస్తుందని మరో సర్వే పేర్కొంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెండేళ్ల పాలనపై ప్రజల్లో నిరాశ కనిపిస్తోందని, ఈ అసంతృప్తి బిఆర్ఎస్ పక్షాన పని చేస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

రేపు సాయంత్రానికల్లా ఫలితాలు వెలువడతాయి. బిఆర్ఎస్ సిట్టింగ్ సీటును మరోసారి నిలబెట్టుకుంటుందా, లేక కాంగ్రెస్ తిరుగుబాటు చేస్తుందా అనేది ఆసక్తిగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *