జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేడెక్కుతున్న నేపథ్యంలో, మూడు ప్రధాన పార్టీలు — కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ — మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. అయితే ఈ పోటీ వెనుక ఒక “సిండికేట్ రాజకీయం” నడుస్తోందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
వీరు చెబుతున్న ప్రకారం, కాంగ్రెస్ అభ్యర్థికి పార్టీ పూర్తి మద్దతు లేనట్లుంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి “ఔట్‌రైట్‌గా గోపీనాథ్‌కి మద్దతు ఇస్తున్నారు” అని విమర్శిస్తున్నారు. ఈ పరిణామం వెనుక బిఆర్ఎస్, టిడిపి, కాంగ్రెస్ నేతలు పరోక్షంగా ఒకే సిండికేట్‌గా పనిచేస్తున్నారని ఆరోపణలు వెలువడుతున్నాయి.
“ఇది సిండికేట్ నిర్ణయం. టిడిపి, బిఆర్ఎస్, రేవంత్ రెడ్డి అందరూ ఒకే టీమ్‌లా పని చేస్తున్నారు. గొడవలు పెట్టుకుని కూడా చివరికి ఒకరినొకరు మద్దతు ఇస్తున్నారు. ప్రజల్లో డీమారలైజేషన్ సృష్టించడమే లక్ష్యం,” అని ఒక రాజకీయ వర్గం చెబుతోంది.
ఒక లేడీ ఇంటిపై పోలీసులు ఎందుకు దాడి చేశారు? బీసీ మహిళ ఇంటిపై ఇంత దురుసుగా వ్యవహరించడం వెనుక రాజకీయ కోపమే ఉంది,” అని విశ్లేషకులు అంటున్నారు.
వీరి మాటల్లో, “నిజమైన నేరస్తులు కాదు, కానీ రాజకీయంగా అసౌకర్యం కలిగించే వ్యక్తులపై పోలీసులు ఒత్తిడి తెస్తున్నారు” అని స్పష్టం చేశారు.
అంతేకాకుండా, ఓటుకు నోట్లు కేసు, సిండికేట్ లావాదేవీలు, మరియు బాజారపు రాజకీయాలు జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వాతావరణాన్ని నెగటివ్ వైపుకి మళ్లిస్తున్నాయని పేర్కొన్నారు.
“ఈ సిండికేట్ ఆట చివరికి ఓ అభ్యర్థికి నష్టకర వాతావరణం సృష్టించడానికి రూపొందించబడింది,” అని వారు వ్యాఖ్యానించారు.

