పంచాయతీ ఎన్నికల రాజకీయాలు: రేవంత్ హామీలు, వాస్తవం ఇంకా దూరమే?

తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నగారా మోగబోతుందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కోర్టు తీర్పులతో ప్రభుత్వ వ్యవస్థ కదలిక మొదలవుతుండగా, మరోవైపు రాజకీయ హామీలు, భిన్న వాగ్దానాలు, మహిళా చీర రాజకీయాలు, సర్పంచుల ఆవేదన—అన్నీ కలిసి రాష్ట్ర రాజకీయాలను మరింత వేడెక్కిస్తున్నాయి.

🔹 42% రిజర్వేషన్ మాట… అమలు సందేహం

ఎన్నికల కమిషనర్ రాణి ఉమా ఇటీవల పరిస్థితులపై అప్డేట్ ఇచ్చిన నేపథ్యంలో, పంచాయతీ ఎన్నికలు త్వరలోనే జరుగుతాయని అర్థమవుతోంది. కానీ ఇక్కడే అసలు చర్చ మొదలవుతోంది.

➡ కోర్టు స్పష్టంగా పాత పద్ధతి ప్రకారమే ఎన్నికలు జరగాలి అని చెప్పింది.
➡ కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పబ్లిక్‌గా 42% పంచాయతీ రిజర్వేషన్ ఇస్తామని మాటిచ్చారు.

ఇప్పుడు ప్రశ్న —
కోర్టు చెప్పింది ఒకటి, ప్రభుత్వం మాటిచ్చింది మరోటి… అమలు ఏది?

ఇది కేవలం న్యాయపరమైన ప్రశ్నగానే కాకుండా రాజకీయంగా కూడా సవాల్‌గా మారింది

🔹 గ్రామాలకు నిధులు? మాటలు చాలాయి… పని లేదు

సర్పంచులు స్పష్టంగా చెబుతున్నారు —
📌 పండుగలు మారాయి
📌 సీజన్లు ముగిశాయి
📌 కానీ గ్రామాలకు ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం ఇవ్వలేదు.

మంత్రి సీతక్క, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఫైనాన్స్ శాఖ — ఎవరి దగ్గరా ఫండ్ల కోసం వెళ్లినా సమాధానం అదే:

“ఇంకా ప్రక్రియలో ఉంది.”

ఇదిలా ఉండగా, రైతులు పత్తి ధరల కోసం ఎదురుచూస్తున్నారు. వరి తడిసిపోయి ఉంది, కానీ కొనుగోలు కేంద్రాలు మాత్రం మూగగా ఉన్నాయి.

వరద బాధితులు… మాటలు మాత్రమే, చర్యలు జీరో?

ఖమ్మం, కామారెడ్డి వంటి జిల్లాల్లో వరదల తర్వాత ప్రభుత్వం ఘనంగా ప్రకటనలు చేసింది. ముఖ్యమంత్రి హెలికాప్టర్‌లో ఎగిరి పరిశీలించారు.
కానీ బాధితులు అడుగుతున్నారు—

“మొదటి రూపాయి ఎక్కడ?”

అన్నీ మీడియా చూపుల కోసం జరిగాయా? ప్రజలు సమాధానం కోరుతున్నారు

చీర రాజకీయాలు: ప్రజా సమస్యలకి ప్రత్యామ్నాయం?

చాలా గ్రామాల్లో ప్రస్తుతం చర్చ ఒక్కటే:

“చీర ఇచ్చాడు కాబట్టి ఓటేస్తామా?”

మహిళలకు స్కై బ్లూ కలర్ చీరలు పంపిణీ చేయడం ద్వారా ఓటర్లను ఆకట్టుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నించిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

నిజంగా గ్రామల్లో:

  • నీరు లేదు
  • రోడ్లు బాగోలేవు
  • గురుకులాల్లో బెంచీలు లేవు
  • టీచర్లు తక్కువ
  • మద్యాహ్న భోజనంలో నాణ్యత లేదు

కాని పరిష్కారం?
చీర.

🔹 హామీలు పెద్దవి… అమలు? కనిపించదు

కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీల జాబితా పెద్దది:

హామీఅమలు స్థితి
నిరుద్యోగ భృతిలేదు
ఆశావర్కర్లకు పెన్షన్లేదు
సర్పంచుల బిల్లుల చెల్లింపులేదు
రైతులకు MSP & పంట భరోసాపూర్తి కాని హామీ
మహిళలకు ₹4,500 పథకంఅమలు లేదు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *