హైదరాబాద్‌లో మరో భారీ ఆర్థిక మోసం వెలుగులోకి వచ్చింది. పెంగ్విన్ సెక్యూరిటీస్ పేరుతో నిర్వహించిన పెట్టుబడి పథకాల ద్వారా అమాయక ప్రజల నుంచి రూ.150 కోట్ల నుంచి రూ.200 కోట్ల వరకు వసూలు చేసి మోసం చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంపై బాధితుల తరఫున అడ్వకేట్ సుబ్బు మీడియా సమావేశంలో స్పందిస్తూ ప్రభుత్వాన్ని, పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు.
ఆయన తెలిపిన వివరాల ప్రకారం, ఐడీపీఎల్, బాలానగర్, కూకట్‌పల్లి ప్రాంతాలకు చెందిన వాడేకర్ బాలాజీ, చౌదరి స్వాతి తదితరులు ప్రజలను అధిక లాభాల పేరుతో ఆకర్షించి పెట్టుబడులు సేకరించినట్లు ఆరోపించారు. చిన్న స్థాయిలో చిట్టీ పద్ధతిలో ప్రారంభమైన ఈ వ్యవహారం క్రమంగా భారీ ఆర్థిక మోసంగా మారిందన్నారు.
బాధితులు తమను ఆశ్రయించడంతో ఇప్పటికే ఆర్థిక నేరాల విభాగం (EOW)లో ఫిర్యాదు చేసి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయించినట్లు వెల్లడించారు. సాధారణ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేస్తే “సివిల్ నేచర్ కేసు” అంటూ తిరస్కరించే పరిస్థితి ఉండటంతో, ఆర్థిక నేరాల కేసుల్లో ప్రత్యేక దృష్టి అవసరమని పేర్కొన్నారు.
పెంగ్విన్ సెక్యూరిటీస్ నిర్వాహకులు బాధితులకు నకిలీ ఇండెమ్నిటీ బాండ్లు ఇచ్చి నమ్మించారని ఆరోపించారు. లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే భారీ వడ్డీ వస్తుందని, తక్కువ పెట్టుబడులతో ఎక్కువ లాభాలు పొందవచ్చని చెప్పి ముఖ్యంగా గృహిణులు, మధ్యతరగతి కుటుంబాలను టార్గెట్ చేశారని చెప్పారు.
కేసులు పెడితే చంపేస్తామని, డబ్బులు తిరిగి ఇవ్వబోమని బాధితులను బెదిరించారని, మహిళలను అవమానపరిచిన ఘటనలు కూడా ఉన్నాయని అడ్వకేట్ సుబ్బు ఆరోపించారు. ఈ కేసును సీరియస్‌గా తీసుకుని ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) లేదా హైకోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
ఆర్థిక నేరాలను కాగ్నిజబుల్ నేరాలుగా గుర్తించి, ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల్లో విచారణ జరిపేలా చట్ట సవరణలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, పోక్సో కేసుల మాదిరిగానే ఆర్థిక మోసాలకు సంబంధించిన కేసుల్లో కూడా త్వరితగతిన న్యాయం జరిగే విధానం తీసుకురావాలన్నారు.
ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, ప్రభుత్వ రంగ సంస్థలు మినహా ప్రైవేట్ వ్యక్తులు, సంస్థల పెట్టుబడి పథకాలను గుడ్డిగా నమ్మవద్దని హెచ్చరించారు. అధిక లాభాల ఆశ చూపించే పథకాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, మోసానికి గురైన వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్ లేదా ఆర్థిక నేరాల విభాగంలో ఫిర్యాదు చేయాలని సూచించారు.

మంగళి కేసులో ఎలాంటి రాజీకి వెళ్లలేదని, అదే విధంగా పెంగ్విన్ సెక్యూరిటీస్ బాధితులకు కూడా చివరి వరకు న్యాయపోరాటం కొనసాగిస్తానని అడ్వకేట్ సుబ్బు స్పష్టం చేశారు.