ప్రభుత్వం ఉదయం లేవగానే మొదట చేసే పని ఏంటంటే… కేసీఆర్ గారిని తిట్టడం!
అదే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి పాలనపై ప్రజల్లో చెలరేగుతున్న అసహనం.
ప్రజల మాటల్లో —
“ఒక మంచి పని చెప్పండి… ఒక్కటి!”
పెన్షన్ పెంచుతానన్నావు — ఇచ్చావా?
రైతు బంధు పెంచుతానన్నావు — పెంచావా?
రైతు బీమా నడుస్తుందా?
దళిత బంధు? పోయింది.
కిట్లు? మూతపడిపోయాయి.
ఒక్క కొత్త రోడ్డు కూడా సాంక్షన్ ఇవ్వలేదురా!”
ఇలా గ్రామాల్లో, బస్తీల్లో, రైతు కూలీల్లో అసహనం రోజు రోజుకి పెరుగుతోంది.
ఫుట్బాల్ సమరం: మెస్సీ vs మేస్త్రీ!?
సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్న మరో సంగతేంటంటే —
“Messi vs Mestri” అంటూ మీమ్స్ దూస్తున్నాయి.
👉 ప్రజల మాట:
“నీకు పాలన చేయాలా? లేక మెస్సీతో బంతి తన్నుకోవాలా?
కాలువలు ఎండిపోయాయి… పంటలు ఆరిపోయాయి… బిల్లులు చెల్లించలేక ప్రజలు తిరుగుతున్నారు.
నీకు మాత్రం స్టేడియాలు, మ్యాచ్‌లు, ఫోటోలు?”
అసలు సమస్య: మాటలు ఎక్కువ — పనులు లేవు
రెండు సంవత్సరాలు పూర్తవుతున్నా —
అభివృద్ధి పనులు కనిపించడం లేదు.
సర్పంచులకు బిల్లులు లేవు.
నిధుల విడుదల లేదు.
గ్రామాల్లో వ్యవస్థలు కుప్పకూలుతున్నాయి.
పాత సర్పంచ్‌లు ప్రభుత్వ గడపకు వెళ్తే —
“రెండు నెలలు ఆగండి” అంటున్నారు.
కేసీఆర్ పేరు వినగానే భయం ఎందుకు?
ప్రజలు ఇప్పుడు బహిరంగంగా అడుగుతున్నారు:
“కేసీఆర్ పేరు వినగానే ఎందుకు చచ్చినట్లవుతున్నావ్ రేవంతా?
ఎన్నికల ముందు అన్నీ చేస్తాను అని చెప్పావ్… ఇప్పుడు మాత్రం మాటలు మాత్రమేముగింపు
ట్రోల్స్, షోలు, మీమ్స్, మ్యాచ్‌లు కాదు — ఇప్పుడు ప్రజలు పనులు అడుగుతున్నారు.
🗳️ వచ్చే ఎన్నికలు దగ్గరవుతున్నాయి.
ప్రజల తీర్పు మాత్రం స్పష్టంగా వినిపిస్తోంది:“మాటలు చాల్లు… ఇప్పుడు అభివృద్ధి చూపించ్!”

