ఉపాధే శాశ్వత పరిష్కారం.. మదర్ ఫౌండేషన్‌తో చర్చించి మహిళలకు మరిన్ని అవకాశాలు కల్పిస్తాం: మంత్రి సీతక్క

మహిళలకు ఉపాధి కల్పించి ఆర్థికంగా స్వావలంబన సాధించే దిశగా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని రాష్ట్ర మంత్రి సీతక్క తెలిపారు. మదర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళల శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, మహిళల సాధికారత కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరించారు. మదర్ ఫౌండేషన్ గత కొన్ని సంవత్సరాలుగా వేలాది మంది మహిళలకు కుట్టు శిక్షణ అందిస్తూ, స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడం అభినందనీయమని ఆమె పేర్కొన్నారు. మహిళా సంఘాల్లో సభ్యులుగా చేరిన వారికి కుట్టు…

Read Full News

ప్రజాభవన్ ముట్టడి ఉద్రిక్తతలు… మహిళల ఆందోళనల మధ్య బుర్కా వివాదం

హైదరాబాద్‌లోని ప్రజాభవన్ వద్ద మహిళల భారీ నిరసన ఉద్రిక్తతలకు దారితీసింది. మహిళలకు ఇచ్చిన సంక్షేమ హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఈ ఆందోళన జరిగింది. ఈ కార్యక్రమానికి సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నేతృత్వం వహించారు. మహిళలకు నెలకు ₹2500 ఆర్థిక సహాయం, పెన్షన్ల పెంపు, స్కూటీలు, బంగారం వంటి హామీలను వెంటనే అమలు చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం హామీలను అమలు చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు కొనసాగిస్తామని హెచ్చరించారు….

Read Full News

భూపాలపల్లి జిల్లా రద్దు ప్రచారం అబద్ధం : సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం

జయశంకర్ భూపాలపల్లి జిల్లా రద్దు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తున్నదన్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. జిల్లాలను రద్దు చేసే ఆలోచన గానీ, కొత్త జిల్లాలు ఏర్పాటు చేసే ప్రతిపాదన గానీ ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో లేదని తేల్చి చెప్పారు. భూపాలపల్లి జిల్లాను రద్దు చేస్తామని ప్రతిపక్షాలు కావాలనే తప్పుడు విషప్రచారం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. ప్రజాపాలన–ప్రగతి బాట కార్యక్రమంలో భాగంగా ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటించిన సీఎం…

Read Full News

గతంలో కేసీఆర్ కిట్ తీసుకున్నవాళ్లు ఉన్నారా లేదా ఒక్కసారి నిజాయితీగా గుర్తు చేసుకోండి.ఆడబిడ్డను ఇంటి దగ్గర నుంచి ప్రభుత్వ వాహనంలో ఆసుపత్రికి తీసుకెళ్లి, అక్కడ ప్రసవం అయిన తర్వాత ఆడపిల్ల పుడితే 13,000 రూపాయలు, మగపిల్ల పుడితే 12,000 రూపాయలు ఇచ్చిన ప్రభుత్వం ఎప్పుడైనా ఉందా? ఇందిరమ్మ పేరు చెప్పుకుంటారు…సోనియా గారు ఉన్నప్పుడు ఇలాంటి పథకం ఎవరైనా ఇచ్చారా?ఎవ్వరూ ఇవ్వలేదు.కేసీఆర్ సార్ ఇచ్చారు. అంత మంచి పథకాన్ని ఇప్పుడు ఎందుకు తీసేశారు?కేసీఆర్ పేరు ఉంటే మార్చండి, మాకు…

Read Full News

రేవంత రెడ్డిపై ప్రజల అసహనం ఉప్పొంగింది — అభివృద్ధి ఎక్కడ? ప్రశ్నలు గాల్లో

ప్రభుత్వం ఉదయం లేవగానే మొదట చేసే పని ఏంటంటే… కేసీఆర్‌ గారిని తిట్టడం!అదే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి పాలనపై ప్రజల్లో చెలరేగుతున్న అసహనం. ప్రజల మాటల్లో —“ఒక మంచి పని చెప్పండి… ఒక్కటి!” పెన్షన్ పెంచుతానన్నావు — ఇచ్చావా?రైతు బంధు పెంచుతానన్నావు — పెంచావా?రైతు బీమా నడుస్తుందా?దళిత బంధు? పోయింది.కిట్లు? మూతపడిపోయాయి.ఒక్క కొత్త రోడ్డు కూడా సాంక్షన్ ఇవ్వలేదురా!” ఇలా గ్రామాల్లో, బస్తీల్లో, రైతు కూలీల్లో అసహనం రోజు రోజుకి పెరుగుతోంది. ఫుట్బాల్ సమరం: మెస్సీ…

Read Full News

కళ్యాణలక్ష్మి చెక్కు కోసం బిడ్డను ఎత్తుకొని వచ్చిన తల్లి… రామగుండంలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అందజేత

రాజన్న సిరిసిల్ల జిల్లా రామగుండంలో ఒక హృద్యమైన ఘటన చోటు చేసుకుంది. పెళ్లి సమయంలో రావాల్సిన కళ్యాణలక్ష్మి చెక్కు ఆలస్యమైన నేపథ్యంలో, పసికందును ఎత్తుకొని వచ్చిన తల్లికి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ స్వయంగా చెక్కును అందజేశారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రారంభించిన కళ్యాణలక్ష్మి–శాదీ ముబారక్ పథకాలు ఎన్నో కుటుంబాలకు అండగా నిలిచినా, కొందరికి ఆలస్యాలు ఎదురవుతున్నాయి. అదే సమస్య వల్ల ఈ తల్లి తన బిడ్డతో కలిసి రామగుండం కార్యాలయానికి రావలసి వచ్చింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రాజ్…

Read Full News

ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ‘ఇంద్రమ్మ చీరలు’ పంపిణీ ప్రారంభం – సీఎం నిర్ణయంపై రాజకీయ వేడి

తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరా గాంధీ గారి జయంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా కోటిమంది మహిళలకు ‘ఇంద్రమ్మ చీరలు’ పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఇందిరమ్మ చీరల పంపిణీపై మంత్రి అనసూయ ధనసరి సీతక్కతో పాటు ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. అర్హులైన ప్రతి మహిళకు నాణ్యమైన ఇంద్రమ్మ చీర అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖలను ఆదేశించారు. అయితే ఈ పథకం పై రాజకీయ విమర్శలు…

Read Full News