గతంలో కేసీఆర్ కిట్ తీసుకున్నవాళ్లు ఉన్నారా లేదా ఒక్కసారి నిజాయితీగా గుర్తు చేసుకోండి.
ఆడబిడ్డను ఇంటి దగ్గర నుంచి ప్రభుత్వ వాహనంలో ఆసుపత్రికి తీసుకెళ్లి, అక్కడ ప్రసవం అయిన తర్వాత ఆడపిల్ల పుడితే 13,000 రూపాయలు, మగపిల్ల పుడితే 12,000 రూపాయలు ఇచ్చిన ప్రభుత్వం ఎప్పుడైనా ఉందా?
ఇందిరమ్మ పేరు చెప్పుకుంటారు…
సోనియా గారు ఉన్నప్పుడు ఇలాంటి పథకం ఎవరైనా ఇచ్చారా?
ఎవ్వరూ ఇవ్వలేదు.
కేసీఆర్ సార్ ఇచ్చారు.
అంత మంచి పథకాన్ని ఇప్పుడు ఎందుకు తీసేశారు?
కేసీఆర్ పేరు ఉంటే మార్చండి, మాకు అభ్యంతరం లేదు.
ఇందిరమ్మ కిట్ అని పెట్టుకోండి.
కానీ ఆ పథకాన్ని తీసేయడం న్యాయమా?
కేసీఆర్ ఉన్నప్పుడు
- రంజాన్ తోఫా వచ్చేది
- క్రిస్మస్ కానుకలు వచ్చేవి
- బతుకమ్మకు చీరలు వచ్చేవి
ఈసారి బతుకమ్మకు చీర ఇచ్చారా?
కనీసం రైకైనా ఇచ్చారా?
ఏమీ లేదు.
ఫ్రీ బస్ ఉంది కదా అని
మహిళలకు ఇంకేమీ అవసరం లేదని అనుకుంటున్నారా?
పెన్షన్ 4000 ఇస్తామని చెప్పారు – ఇవ్వలేదు
స్కూటీ ఇస్తామని చెప్పారు – ఇవ్వలేదు
నెలకురోసం ఇస్తామని చెప్పారు – ఇవ్వలేదు
అయినా సరే, “మాకే ఓటేస్తారు” అని భావిస్తున్నారా?
బతుకమ్మ చీర అంటే ఒకే డిజైన్ కాదు.
ఆడవాళ్లకు నచ్చేలా రకరకాల డిజైన్లు ఉండాలి.
కేసీఆర్ ఉన్నప్పుడు 300కి పైగా డిజైన్లు తయారు చేశాం.
అందుకే మహిళలు ఆనందంగా తీసుకున్నారు.
ఇప్పుడు ఏమైంది?
చీరలు పోయాయి
కేసీఆర్ కిట్ పోయింది
పద్మశాలీల ఆర్డర్లు పోయాయి
ఒకప్పుడు నెలకు 7,000 సంపాదించిన కార్మికుడు
కేసీఆర్ పాలనలో 16,000 – 20,000 సంపాదించాడు.
ఇప్పుడు ఆర్డర్లు లేవు,
కరెంట్ చార్జీలు పెరిగాయి,
సర్చార్జీలతో చంపుతున్నారు.
నేను మీకు ఒకటే మాట చెప్తున్నా—
సిరిసిల్లలో పద్మశాలీలు బాగుంటేనే, పట్టణం బాగుంటది.
గతంలో ఏ తప్పులు జరిగితే
అవి నా మీద కోపంగా తీసుకోకండి.
మీ కోపం వల్ల
మీకు నష్టం
నాకు నష్టం
మొత్తం సిరిసిల్లకే నష్టం.
తాత్పర్యంగా ఆలోచించండి.

