తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం లో కొత్త సంచలనం.
తాజాగా వివిధ భూ కేటాయింపులు, టెండర్లు, కాంట్రాక్ట్ పనుల వివరాలు తెలుసుకునేందుకు పెద్ద ఎత్తున ఆర్టీఐ (RTI) దరఖాస్తులు సమర్పించబడుతున్నాయి. వీటిలో కొన్ని మంత్రులే లేదా వారి అనుచరులే పెట్టినవని సమాచారం.
ఆర్టీఐల ద్వారా ఎన్ని కంపెనీలు టెండర్లు దాఖలు చేశాయి, వారి టెక్నికల్ మరియు ఫైనాన్షియల్ బిడ్స్ వివరాలు, భూముల కేటాయింపుల జాబితా, ఇవన్నీ కూడా కోరుతున్నారని తెలుస్తోంది.
దాంతో జిల్లా స్థాయి అధికారులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. కొందరు అధికారులు సమాచారం ఇవ్వగా, మరికొందరు మౌనం వహిస్తున్నారని టాక్.
అయితే స్పందించని అధికారులకు కొంతమంది మంత్రుల అనుచరులు ఫోన్ కాల్స్ చేసి ఒత్తిడి చేస్తున్నారని, “మాకే ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు… పబ్లిక్‌ను ఎలా సతాయిస్తారో?” అంటూ హెచ్చరింపులు వస్తున్నాయట.
ఇదే సమయంలో, ఆర్టీఐల వెనుక రాజకీయ ఉద్దేశం ఉందా? అనే అనుమానాలు గాఢమవుతున్నాయి.
“రేవంత్ రెడ్డి తర్వాత ముఖ్యమంత్రి అవుదాం అనుకునే కొందరు మంత్రులే ఈ పావులు కదుపుతున్నారు” అని విశ్వసనీయ వర్గాల సమాచారం.
ముఖ్యంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరియు ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్లు చర్చనీయాంశంగా మారాయి.
వీరిద్దరూ తమ ప్రాంతాల్లో అధికార వ్యవహారాలు, టెండర్ల వివరాలు తెలుసుకోవడంలో ఆసక్తి చూపుతున్నారట.
“రేవంత్ తర్వాత ఎవరికోసం ఈ భూముల ఆరాలు తీస్తున్నారు?” అని పార్టీ నేతలే ప్రశ్నిస్తున్నారు.
ఇదే సమయంలో కొండా సురేఖ – సుమంత్ కేసు మళ్లీ ప్రస్తావనలోకి వచ్చింది.
ఈ కేసులో ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించకపోవడం, ఆయన ‘సైలెంట్ గేమ్’ ఆడుతున్నారనే విమర్శలకు దారితీసింది.
ఇక రేవంత్ రెడ్డి గారి రాజకీయ వ్యూహం పై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కీలక శాఖల్లో అన్నీ రెడ్డి నేతలే ఉండటం, ఇన్ఫర్మేషన్ కమిషన్‌లో కూడా అయోధ్య రెడ్డికి అవకాశం రావడం,
మిగతా వర్గాల నేతల్లో అసంతృప్తిని పెంచుతోందని పార్టీ వర్గాలు అంటున్నాయి.
మొత్తం మీద, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆర్టీఐల యుద్ధం మొదలైందని,
ఇది కేవలం సమాచార హక్కు కోసం కాకుండా రాబోయే నాయకత్వ పోటీకి ముందుజాగ్రత్త చర్యగా ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

