తెలంగాణ ఆర్థిక సంక్షోభానికి ఎవరు బాధ్యులు? భట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డిపై తీవ్రమైన ఆరోపణలు

పూజలు చేయడం, గోవులకు పూజ చేయడం, దేవుడి పేరు చెప్పడం వల్ల తాము చేసిన పాపాలు పోతాయని, దేవుడు క్షమించేస్తాడని భావించడం భ్రమ మాత్రమే. ప్రజల రక్తం పీల్చి, కాంట్రాక్టర్లను రోడ్డుపై కూర్చోబెట్టి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసిన పాపాలు ఇంత సులువుగా పోయేవి కావు.

ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభానికి ప్రధాన కారణం ఎవరు అంటే ఫైనాన్స్ శాఖను నిర్వహిస్తున్న బట్టి విక్రమార్క అని చెప్పక తప్పదు. లెక్కలే రాని, లెక్కలు ఎలా చూసుకోవాలో కూడా తెలియని వ్యక్తికి రాష్ట్ర ఖజానా అప్పగిస్తే పరిస్థితి ఇలాగే తయారవుతుంది. ముఖ్యమంత్రి పదవి సంగతి పక్కన పెడితే, ఉపముఖ్యమంత్రి పదవికి కూడా భట్టి విక్రమార్క అర్హుడు కాదనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.

ఒక వైపు నిరుద్యోగ యువత ఉద్యోగాలు లేవని, నిరుద్యోగ భృతి ఇవ్వాలని రోడ్లపైకి వస్తున్నారు. మరోవైపు రిటైర్మెంట్ అయిన ఉద్యోగులు పెన్షన్లు రావట్లేదని ఆందోళనలు చేస్తున్నారు. ఇవన్నీ జరుగుతున్నా ఫండ్స్ రిలీజ్ చేయాల్సిన ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ నుంచి స్పందన లేదు. హెలికాప్టర్లలో తిరగడానికి, ఫ్లైట్లలో ప్రయాణించడానికి మాత్రం డబ్బులు ఉంటాయి కానీ ప్రజల అవసరాలకు మాత్రం ఖజానా ఖాళీగా ఉందని చెబుతారు.

ప్రజాభవన్ లాంటి ప్రభుత్వ ఆస్తిని వ్యక్తిగత కార్యక్రమాలకు వాడటం, ప్రజాధనాన్ని వృథా చేయడం ప్రజాస్వామ్యానికి అవమానం. మీ ఇంటి వేడుకలకు ప్రభుత్వ డబ్బులు వస్తాయి కానీ తెలంగాణ ప్రజల కోసం ఫండ్స్ రిలీజ్ చేయడానికి మాత్రం చేతులు వణుకుతాయి. మహిళలను లక్షాధికారులను చేస్తామని చెప్పిన హామీలు ఏమయ్యాయి? వైయస్సార్ పేరు చెప్పుకుంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి అయిపోతామా అనే ప్రశ్నలు సహజంగానే వస్తున్నాయి.

ఈ మొత్తం వ్యవహారంలో మీడియా పాత్ర కూడా అనుమానాస్పదంగానే ఉంది. ఎన్టీవీ చౌదరితో చేతులు కలిపి రాజకీయ ప్రత్యర్థులను టార్గెట్ చేయడం, ఐఏఎస్ అధికారిని కూడా వివాదంలోకి లాగడం ఎంతవరకు న్యాయం? ఈ విషయంలో రాధాకృష్ణ గారు చెప్పిన మాటల్లో వాస్తవం లేదని పూర్తిగా కొట్టిపారేయలేము. బట్టి విక్రమార్క తరఫున బతిమిలాడడానికి మల్లు రవిని పంపారన్న ఆరోపణలు కూడా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

రేవంత్ రెడ్డి రాష్ట్రంలో లేని సమయంలో పావులు కదపడం, హైకమాండ్‌ను ప్రభావితం చేయడానికి ప్రయత్నాలు జరిగాయా అన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. బట్టి విక్రమార్క పదవి ఉంటుందా? ఉండదా? అన్నది కాలమే తేల్చాలి. కానీ అవసరమైతే కుల సమీకరణలు తీసుకొచ్చే రాజకీయ నాయకులు, తమ కులం ప్రజలకు ఏమి చేశారో మాత్రం చెప్పరు

రేవంత్ రెడ్డి విషయంలోనూ ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. రాజకీయంగా మార్పు వస్తుందని ఆశించిన ప్రజలకు నిరాశే మిగిలింది. సినిమాల్లో క్లైమాక్స్‌లో పాత్రలు మారుతాయి కానీ నిజ జీవితంలో నాయకులు మారతారా? అనే సందేహం తెలంగాణ ప్రజల మనసుల్లో బలంగా నిలిచిపోయింది. మారేది నాయకులు కాకపోతే, చివరికి మారాల్సింది ప్రజలే అన్న చేదు నిజం మరింత స్పష్టమవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *