జూబ్లీ హిల్స్‌లో బిఆర్ఎస్ ఘోర పరాభవం: ఓటమికి కారణాలు ఏమిటి? లోపాలపై పూర్తి విశ్లేషణ

జూబ్లీ హిల్స్ ఉపఎన్నికలో బిఆర్ఎస్ పార్టీ భారీగా వెనుకబడటానికి అనేక అంతర్గత లోపాలు, వ్యూహపరమైన తప్పిదాలు, చివరి నిమిషం గందరగోళం ముఖ్య కారణాలుగా విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రజలు, స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తల మాటల్లో బిఆర్ఎస్ ఓటమి వెనుక ఉన్న ప్రధాన అంశాలు ఇవే—

1. హరీష్ రావు అందుబాటులో లేకపోవడం

ఎన్నికల క్యాంపెయిన్ పీక్ టైంలో — సుమారు 10 నుండి 12 రోజుల పాటు — హరీష్ రావు ఫీల్డ్‌లో లేకపోవడం బిఆర్ఎస్‌కు పెద్ద నష్టం.
• ఆయన అనుకోని వ్యక్తిగత విషాదం వల్ల బయటకు రాలేకపోయాడు.
• కానీ క్యాడర్‌లో దీనివల్ల తీవ్ర నిరుత్సాహం వచ్చింది.
• మాస్ లీడర్ లేకపోవడం ప్రచారాన్ని బలహీనపరిచిందని నేతలు భావిస్తున్నారు.

2. కేసీఆర్ రాకపోవడం – కీలక వ్యూహపరమైన తప్పు

జూబ్లీ హిల్స్ వంటి ప్రాధాన్య ప్రాంతంలో కేసీఆర్ రాకపోవడం బిఆర్ఎస్ ఓటమికి ప్రధాన కారణమని క్యాడర్ స్పష్టంగా చెప్తోంది.

ప్రచారంలో డైలాగ్ ఒక్కటే:
“మేము వస్తాం… కేసీఆర్ రాకపోవచ్చు.”

కానీ రెండవ వైపుకి:
• కేసీఆర్ రోడ్షో/సభ చేయకపోతే ఇమేజ్ డామేజ్ అవుతుందనే భయం ఉండొచ్చు.
• లేదా స్థానిక నాయకులు “ఈ ఎన్నికను నేనే గెలిపిస్తా” అన్న ఈగోతో ఉండి ఉండొచ్చు.

ఏది అయినా—
కేసీఆర్ రాకపోవడం మైనస్ అయ్యింది.

3. అసెంబ్లీ మోడ్ ప్రచారాన్ని ఉపఎన్నికలో ఫాలో అవడం

ఇది చాలా పెద్ద స్ట్రాటజీ ఫెయిల్యూర్.

ఉపఎన్నికలో అవసరమయ్యేది:
→ “గల్లీ గల్లీ – బూత్ బూత్ ప్రచారం”

కానీ బిఆర్ఎస్ చేసింది మాత్రం:
→ “రాష్ట్ర స్థాయి అసెంబ్లీ స్టైల్ క్యాంపెయిన్”

దీంతో:
• లోకల్ సమస్యలు పట్టించుకోలేదు
• ప్రజల అసలు మూడ్ గ్రహించలేదు
• బూత్ స్థాయి నెట్‌వర్క్ పూర్తిగా వీక్ అయింది

4. కేటీఆర్ లాస్ట్ రెండు రోజుల్లో ఎన్నికను వదిలేయడం

పోలింగ్‌కు ముందు చివరి 48 గంటలు ఏ ఎన్నికలోనైనా అత్యంత కీలకం.

కానీ ఇక్కడ—
• కేటీఆర్ లాస్ట్ రెండు రోజులు సమర్థవంతంగా పని చేయలేదు
• పోలింగ్ మేనేజ్‌మెంట్ పూర్తిగా హ్యాండిల్ కాలేదు
• ఏజెంట్లు, లోకల్ లీడర్లు, బూత్ క్యాప్టెన్లలో సమన్వయం లేకపోయింది

దీంతో:
“ఎన్నికను లాస్ట్ మినిట్‌లో కాంగ్రెస్‌కి గిఫ్ట్ ఇచ్చినట్లే అయింది” అని క్యాడర్ భావిస్తోంది.

5. డబ్బుల పంపిణీలో భారీ గందరగోళం – 1000 vs 5000

ఈ ఎన్నికలో బిఆర్ఎస్‌కు అతిపెద్ద నష్టం తీసుకొచ్చిన అంశం ఇదే.

ప్రజల స్థాయిలో ఏమైంది?
• కాంగ్రెస్ పంపింది – ₹5000
• బిఆర్ఎస్ పంపింది – కేవలం ₹1000

అది కూడా:
→ నేతలు, ఇంచార్జీలు, లోకల్స్, బూత్ ఏజెంట్ల వద్దే 40–60% డబ్బు “సెట్” అయిపోయింది.
ప్రజలకు వచ్చినది చాలా తక్కువ.

కొన్ని బూత్‌లలో ప్రజల మాట:
“డబ్బు రాలేదని… ఓటు వేయలేదు.”

ఇది నిజంగా జరిగిన సంఘటన — మునుగోడులో జరిగినట్లే.

6. ఇంచార్జీలు, లోకల్ నాయకులు పూర్తిగా ఫెయిల్

• ఇంచార్జీలు గ్రౌండ్‌లో కనిపించలేదు
• పోలింగ్ రోజు ఎవ్వరూ లేకపోవడం పెద్ద షాకింగ్
• పెద్ద నాయకులు లేటుగా రావడం
• ప్లానింగ్ జీరో
• ఏజెంట్లకు స్పష్టమైన ఇన్‌స్ట్రక్షన్ లేకపోవడం

7. అంతర్గత గ్రూపింగ్ – కీలక నాయకుల నిరాసక్తత

ప్రాంతంలో ఉన్న పెద్ద నేతల మధ్య గ్రూపింగ్ బిఆర్ఎస్‌ను బలహీనపరిచింది.

ఉదాహరణలు:
• తలసాని కుటుంబానికి నవీన్ విజయంపై భయం
• పీజీఆర్ కుటుంబానికి సీటు తిరిగి రావడంపై ఆందోళన
→ అందుకే కొందరు “సైలెంట్‌గా” ప్రచారం నుంచి దూరంగా ఉన్నారు.

ఇది పార్టీకి పెద్ద నష్టం.

8. కాంగ్రెస్ అగ్రెసివ్ క్యాంపెయిన్‌ను అండర్ ఎస్టిమేట్ చేయడం

బిఆర్ఎస్ “కాంగ్రెస్ భయపడుతుంది” అని భావించింది.
కానీ కాంగ్రెస్:
• 3 రాష్ట్ర మంత్రులు
• DK శివకుమార్ టీమ్
• భారీ ఫండింగ్
• బూత్ వార్ రూమ్స్
• డోర్-టు-డోర్ మైక్రో మేనేజ్‌మెంట్

ఇవన్నీ చేసి బిఆర్ఎస్‌పై దాడి చేసింది.
కానీ బిఆర్ఎస్ అటువంటి అగ్రెసివ్ క్యాంపెయిన్‌కి సన్నద్ధం కాలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *