యాకుత్పుర ప్రాంతానికి చెందిన యువకుడు టెలిగ్రామ్‌లో ఒక అమ్మాయితో పరిచయమయ్యాడు. ఆ అమ్మాయి పెయిడ్ సర్వీస్ సేవలు అందిస్తున్నట్లు తన ఫోటోలు పంపింది. యువకుడు ఆకర్షితుడై పలుమార్లు చాటింగ్, వీడియో కాల్స్ చేశాడు.
తనతో గడిపేందుకు సిద్ధమైన యువకుడు అడ్వాన్స్ బుకింగ్, సెక్యూరిటీ రూమ్ రిజర్వేషన్, రిఫండ్ పేర్లలో లక్షలు చెల్లించాడు. ఒక హోటల్లో రూమ్ బుక్ అయిందని చెప్పినా, అక్కడికి వెళ్లినప్పుడు ఎవరు కనిపించలేదు.
మోసాన్ని గ్రహించిన యువకుడు సైబర్ క్రైమ్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. కేసును సైబర్ క్రైమ్ టీమ్ దర్యాప్తు చేస్తోంది.
జాగ్రత్త సూచనలు:
- ఆన్‌లైన్ లో అందమైన ఫోటోలు చూసి ఆకర్షితులవద్దు.
- అడ్వాన్స్ ఫీజులు, రిఫండ్, రూమ్ బుకింగ్ లావాదేవీలలో జాగ్రత్త.
- సమస్య వచ్చినప్పుడు సైబర్ క్రైమ్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలి.

