రాష్ట్ర ప్రభుత్వం, నాయకులపై తీవ్ర విమర్శలు – నిరుద్యోగులు, స్కామ్‌లపై ప్రభుత్వం స్పందించాలంటూ ఆవేదన
తాజాగా రాష్ట్ర రాజకీయ వాతావరణాన్ని ఉద్దేశిస్తూ తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యమంత్రి రేవంత రెడ్డి సహా పలువురు మంత్రులు, ఐఏఎస్ అధికారులపై పలు ఆరోపణలు చేస్తూ ప్రజా వేదికల్లో ఆవేదన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా నిరుద్యోగులు, విద్యార్థులు, స్కామ్‌లు, అపాయింట్‌మెంట్ రాజకీయాలపై ఆగ్రహ స్వరం వినిపిస్తోంది. విమర్శకుల వ్యాఖ్యల ప్రకారం,“పెళ్లి కార్డులు తీసుకుని సెలబ్రిటీలకు వెళ్లే ప్రభుత్వానికి, నిరుద్యోగులకు మాత్రం సమయం లేదనే పరిస్థితి ఏర్పడింది. ప్రజా సమస్యలపై సమావేశాలు పెట్టకుండా, ప్రముఖులకు కోట్ల విలువైన ఆప్యాయతలు చూపుతున్నారని”…

