అసెంబ్లీలో ప్రశ్నించే హక్కే ప్రజాస్వామ్యానికి ప్రాణం: ప్రతిపక్షాల పాత్రపై కీలక వ్యాఖ్యలు
ప్రెస్ మీట్లలో ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ఒక ఎత్తయితే, అసెంబ్లీలో అధికారికంగా ప్రశ్నించడం మరొక ఎత్తని వ్యాఖ్యానించారు ఓ రాజకీయ విశ్లేషకుడు. అసెంబ్లీలో ప్రశ్నించే హక్కు ప్రతిపక్షాలకు తప్పనిసరిగా ఉండాలని, బీఆర్ఎస్, బీజేపీ వంటి పార్టీలకు ఈ హక్కు రాజ్యాంగబద్ధంగా ఉందని పేర్కొన్నారు. అసెంబ్లీ కార్యకలాపాలను యావత్ దేశం గమనిస్తుందని, అక్కడ పాస్ అయ్యే బిల్లులే చట్టాలుగా మారతాయని గుర్తు చేశారు. ప్రజలు తమ సమస్యలపై అసెంబ్లీలో తమ ఎమ్మెల్యేలు ఎలా మాట్లాడుతున్నారో చూస్తారని తెలిపారు. నిరుద్యోగులు, పెన్షన్…

