నల్గొండ సభలో రాజకీయ వేడి.. కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలపై విమర్శలు, మంత్రుల ఎల్ఈడీ స్క్రీన్ వివాదం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నల్గొండలో నిర్వహించిన సభ రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. సభలో సీఎం చేసిన ప్రసంగం, కాంగ్రెస్ నాయకుల మధ్య చోటుచేసుకున్న వాగ్వాదం, అలాగే వేదికపై జరిగిన తోపులాట ఘటనపై పలువురు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. సభ ప్రారంభంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పాటలు, నినాదాలతో కార్యక్రమం కొనసాగినప్పటికీ, అనంతరం వేదికపై సీఎం భద్రతా సిబ్బంది మరియు స్థానిక కాంగ్రెస్ నాయకుల మధ్య జరిగిన తోపులాట చర్చకు దారితీసింది. తనను నెట్టివేశారని ఆరోపిస్తూ ఒక…

Read Full News

అవినీతి అధికారులపై ఏసీబీ దూకుడు.. మోహన్ నాయక్ అరెస్ట్‌తో మరిన్ని శాఖల్లో సోదాలకు రంగం సిద్ధం?

అవినీతి అధికారులపై ఏసీబీ దూకుడు.. మోహన్ నాయక్ అరెస్ట్‌తో మరిన్ని శాఖల్లో సోదాలకు రంగం సిద్ధం? తెలంగాణలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభుత్వ అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దూకుడు పెంచినట్లు కనిపిస్తోంది. హోదాతో సంబంధం లేకుండా ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు రాజకీయ, అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. సొంత పార్టీ నేతల అండదండలు ఉన్నా పట్టించుకోకుండా, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిఘా వర్గాలకు గ్రీన్…

Read Full News

ఆర్‌అండ్‌బీ చీఫ్ ఇంజనీర్ ఇంట్లో వందల కోట్ల అక్రమాస్తులు?.. కట్టల కొద్ది నగదు, కిలోల కొద్దీ బంగారం స్వాధీనం

రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖలో భారీ అవినీతి ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ప్రభుత్వ నిర్మాణ పనుల్లో కీలక బాధ్యతలు నిర్వహించే ఆర్‌అండ్‌బీ శాఖ ఇంజనీర్-ఇన్-చీఫ్ జే. మోహన్ నాయక్ నివాసాలు, కార్యాలయాలు, బంధువులు, బినామీలు, అనుచరుల ఇళ్లపై ఏసీబీ అధికారులు నిర్వహించిన మెరుపు దాడుల్లో కళ్లు చెదిరే అక్రమాస్తులు వెలుగులోకి వచ్చాయి. ప్రభుత్వ రహదారులు, వంతెనలు, ఫ్లైఓవర్లు, భవనాల నిర్మాణాలకు సంబంధించిన భారీ టెండర్లు ఈ శాఖ పరిధిలోనే జరుగుతుంటాయి. ప్రజాధనం వేల కోట్ల రూపాయలు ఖర్చయ్యే…

Read Full News

ఆర్‌అండ్‌బీ ఈఎన్‌సీ మోహన్ నాయక్‌పై ఏసీబీ మెరుపు దాడులు.. 11 ప్రాంతాల్లో సోదాలు

ఆర్‌అండ్‌బీ ఈఎన్‌సీ మోహన్ నాయక్‌పై ఏసీబీ మెరుపు దాడులు.. 11 ప్రాంతాల్లో సోదాలు తెలంగాణలో మరోసారి అవినీతి ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో భారీగా ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. రోడ్లు మరియు భవనాల శాఖ (ఆర్‌అండ్‌బీ)లో కీలక అధికారిగా పనిచేస్తున్న ఇంజినీర్-ఇన్-చీఫ్ (స్టేట్ రోడ్స్) మోహన్ నాయక్ నివాసంతో పాటు ఆయనకు సంబంధించిన పలు ప్రాంతాల్లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఏకకాలంలో దాడులు చేపట్టింది. సమాచారం ప్రకారం, మియాపూర్ కేంద్రంగా మొత్తం 11…

Read Full News

జలమండలి జీఎం ఇంట్లో కోట్ల ఖజానా.. ఏసీబీ దాడుల్లో కళ్లుచెదిరే ఆస్తులు!

హైదరాబాద్ జలమండలిలో పనిచేస్తున్న ఓ ఉన్నతాధికారి ఇంట్లో ఏసీబీ దాడులు సంచలనం సృష్టించాయి. సాధారణ ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తూ కోట్లాది రూపాయల ఆస్తులు కూడబెట్టిన వ్యవహారం బయటపడటంతో ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. జలమండలి జనరల్ మేనేజర్ అనంత లక్ష్మీకుమార్ నివాసంతో పాటు ఆయన బంధువులు, స్నేహితులు, బినామీలకు సంబంధించిన పలు ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ దాడుల్లో భారీ మొత్తంలో నగదు, బంగారం, వెండి, భూముల పత్రాలు బయటపడినట్టు సమాచారం. ఏసీబీ…

Read Full News

జాయింట్ సబ్ రిజిస్టర్ ఇంట్లో ఏసీబీ సోదాలు: 100 కోట్ల అక్రమాస్తులు వెలుగులోకి

రంగారెడ్డి జిల్లా జాయింట్ సబ్ రిజిస్టర్ మధుసూదన్ రెడ్డి ఇల్లు, కార్యాలయాలపై యాంటీ కరప్షన్ బ్యూరో (ACB) అధికారులు శుక్రవారం విస్తృత సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టినట్టు వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో చేపట్టిన ఈ దాడుల్లో సుమారు ₹100 కోట్లకు పైగా అక్రమాస్తులు ఉన్నట్టు అధికారులు ప్రాథమికంగా గుర్తించినట్టు సమాచారం. మధుసూదన్ రెడ్డి బంధువులు, స్నేహితులు, బినామీలకు సంబంధించిన ఏడు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఫార్మ్ హౌసులు, ఓపెన్ ఫ్లాట్లు,…

Read Full News

రవాణా శాఖలో అవినీతి తిమింగలం.. డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ కిషన్ నాయక్ వద్ద రూ.200 కోట్ల ఆస్తులు బయటపడ్డాయి

రవాణా శాఖలో భారీ అవినీతి తిమింగలం వెలుగులోకి వచ్చింది. మహబూబ్‌నగర్ జిల్లా డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ (డీటీసీ) ఎం. కిషన్ నాయక్ వద్ద ఆదాయానికి మించిన ఆస్తులు భారీగా ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ప్రాథమిక అంచనాల ప్రకారం ఆయన వద్ద ఉన్న ఆస్తుల బహిరంగ మార్కెట్ విలువ సుమారు రూ.200 కోట్ల వరకు ఉంటుందని ఏసీబీ వెల్లడించింది. ఈ నేపథ్యంలో కిషన్ నాయక్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న ఫిర్యాదుల…

Read Full News

అదిలాబాద్‌కు ఏడాదిలోపే ఎయిర్‌పోర్ట్: నియోజకవర్గ అభివృద్ధి బాధ్యత నాదే – సీఎం రేవంత్”

అదిలాబాద్ జిల్లాలో జరిగిన భారీ జనసభలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటనలు చేశారు. వచ్చే ఏడాది లోపే అదిలాబాద్‌లో ఎయిర్‌బస్ ప్రమాణాలతో విమానాశ్రయ నిర్మాణ పనులు ప్రారంభం అవుతాయని తెలిపారు. జిల్లాను అభివృద్ధి పట్టాలెక్కించడం తమ ప్రభుత్వ లక్ష్యం అని చెప్పారు. పట్టణం, గ్రామాల అభివృద్ధికి పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు బాధ్యతగా ఓటు వేయాలని సీఎం పిలుపునిచ్చారు. అభివృద్ధి చేయగలిగిన వారిని మాత్రమే గెలిపించాలని, అభ్యర్థులు అడ్డగోలుగా డబ్బు ఖర్చు చేసే సంస్కృతిని అడ్డుకోవాలని కోరారు….

Read Full News