కేటీఆర్‌పై ఇందుజ ఫిర్యాదు.. పెళ్లి ఫొటోలతో ట్రోలింగ్ చేస్తున్నారంటూ ఆరోపణలు
హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో కేటీఆర్, ప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్ మధ్య వివాదం మరో మలుపు తిరిగింది. తన వివాహ ఫొటోలను వక్రీకరించి సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ నాయకురాలు, బల్మూరి వెంకట్ సతీమణి ఇందుజ ఆరోపించారు. ఈ వ్యవహారంపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆయనకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాయని ఆమె ఆరోపించిన సోషల్ మీడియా ఖాతాలపై విచారణ జరపాలని కోరారు. ఈ ఫిర్యాదు, ఆరోపణలకు సంబంధించిన…

