ఆర్‌అండ్‌బీ చీఫ్ ఇంజనీర్ ఇంట్లో వందల కోట్ల అక్రమాస్తులు?.. కట్టల కొద్ది నగదు, కిలోల కొద్దీ బంగారం స్వాధీనం
రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖలో భారీ అవినీతి ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ప్రభుత్వ నిర్మాణ పనుల్లో కీలక బాధ్యతలు నిర్వహించే ఆర్‌అండ్‌బీ శాఖ ఇంజనీర్-ఇన్-చీఫ్ జే. మోహన్ నాయక్ నివాసాలు, కార్యాలయాలు, బంధువులు, బినామీలు, అనుచరుల ఇళ్లపై ఏసీబీ అధికారులు నిర్వహించిన మెరుపు దాడుల్లో కళ్లు చెదిరే అక్రమాస్తులు వెలుగులోకి వచ్చాయి. ప్రభుత్వ రహదారులు, వంతెనలు, ఫ్లైఓవర్లు, భవనాల నిర్మాణాలకు సంబంధించిన భారీ టెండర్లు ఈ శాఖ పరిధిలోనే జరుగుతుంటాయి. ప్రజాధనం వేల కోట్ల రూపాయలు ఖర్చయ్యే…

