ఫీజు రీయింబర్స్‌మెంట్ కేసు విచారణ జూలై 6కు వాయిదా.. మధ్యంతర ఉత్తర్వులు కొనసాగింపు
తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించిన పిటిషన్లపై విచారణను తెలంగాణ హైకోర్టు జూలై 6కు వాయిదా వేసింది. తదుపరి విచారణ వరకు గతంలో జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులు అమల్లోనే ఉంటాయని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ కేసు గత విచారణ సందర్భంగా విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్–9లోని కొన్ని నిబంధనల అమలుపై తాత్కాలిక స్టే విధించడంతో పాటు, విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయవద్దని…

