మమ్మల్ని చంపేస్తామంటున్నారు”.. మాజీ మేయర్ బొంతు రామ్మోహన్‌పై పీజీ నిర్వాహకుల ఆరోపణలు
హైదరాబాద్ అమీర్‌పేటలో నిర్వహిస్తున్న ఓ గర్ల్స్ పీజీ హాస్టల్ విషయంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమను బెదిరిస్తూ, హాస్టల్‌ను బలవంతంగా హ్యాండ్ ఓవర్ చేయాలని ఒత్తిడి తెస్తున్నారని పీజీ నిర్వాహకులు మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, ఆయన భార్య శ్రీదేవిపై తీవ్ర ఆరోపణలు చేశారు. తమ కుటుంబానికి ప్రాణహాని ఉందంటూ ప్రభుత్వాన్ని, పోలీసులను వేడుకుంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఏషియన్ పీజీ ఫర్ గర్ల్స్ నిర్వహిస్తున్న వీర హనుమాన్ రెడ్డి మాట్లాడుతూ, గత మూడు…

