ఆర్టీసీ కార్మికుల హెచ్చరిక: “డిమాండ్లు నెరవేర్చకపోతే సమ్మె తప్పదు”
రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల అసంతృప్తి తీవ్రరూపం దాల్చుతోంది. ప్రభుత్వం ఆర్టీసీ సమస్యలను పట్టించుకోవడం లేదని కార్మిక సంఘాలు తీవ్రంగా ఆరోపిస్తున్నాయి. గత రెండున్నర సంవత్సరాలుగా తమ సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం ముందుకు రాలేదని వారు అంటున్నారు. ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పిన వాగ్దానంపై స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు. అలాగే నెలకు రూ.350 కోట్ల రీయింబర్స్‌మెంట్ ఇవ్వాలని చెప్పి మాట తప్పిందని…

