యాదగిరిగుట్ట దేవస్థానం పాలకమండలి ఏర్పాటు.. చైర్మన్‌గా ఎంఎస్‌ఎన్ ఫార్మా అధినేత ఎం. సత్యనారాయణ రెడ్డి
తెలంగాణ ప్రభుత్వం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం పాలకమండలిని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 18 మంది సభ్యులతో కూడిన ఈ పాలకమండలికి ఎంఎస్‌ఎన్ ఫార్మా అధినేత ఎం. సత్యనారాయణ రెడ్డిని చైర్మన్‌గా నియమించింది. ఈ పాలకమండలి పదవీకాలం రెండేళ్లు ఉంటుంది. ప్రభుత్వం విడుదల చేసిన వివరాల ప్రకారం, పాలకమండలిలో మొత్తం 18 మంది సభ్యులు ఉంటారు. వీరిలో 11 మంది వివిధ రంగాలకు చెందిన సభ్యులు కాగా, మరో ఏడుగురు ప్రభుత్వ అధికారులు…

