నీట్ రీ-ఎగ్జామ్‌లో భారీ మోసం బట్టబయలు: 10 లక్షల డీల్‌తో డమ్మీ అభ్యర్థులు, 30 మంది అరెస్ట్
దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎదురుచూసిన నీట్ (NEET) రీ-ఎగ్జామ్‌లో మరోసారి సంచలన మోసం వెలుగులోకి వచ్చింది. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు, బయోమెట్రిక్ ధృవీకరణ, ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థలు ఉన్నప్పటికీ బీహార్‌లో భారీ ఎగ్జామ్ మాఫియా వ్యవహారం బయటపడింది. బీహార్ రాష్ట్రంలోని లఖీసరాయ్ జిల్లాలో అసలైన అభ్యర్థుల స్థానంలో ఎంబీబీఎస్ విద్యార్థులను పరీక్ష రాయించేందుకు ఏర్పాటు చేసిన ఒక నెట్‌వర్క్‌ను పోలీసులు ఛేదించారు. ఈ వ్యవహారంలో ఇప్పటివరకు 30 మందిని అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు. పోలీసుల…

