జానపద కళాకారుల సంక్షేమం కోసం ప్రత్యేక సంఘం.. ఆరోగ్య కార్డులు, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలి!
తెలంగాణ జానపద కళాకారుల జీవితాల్లో ఎన్నో కష్టాలు దాగి ఉన్నాయని, వారి గొంతు ప్రజలకు వినిపిస్తున్నా వారి వ్యక్తిగత జీవితాల్లో ఎదురవుతున్న ఆర్థిక ఇబ్బందులు మాత్రం ఎవరికీ తెలియడం లేదని జానపద గాయకుడు సంతోష్ ఆవేదన వ్యక్తం చేశారు. కళాకారుల సమస్యలకు పరిష్కారం చూపడంతో పాటు, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నవారికి అండగా నిలిచేందుకు తెలంగాణ జానపద గాయకుల సంఘం ఏర్పాటు దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో OK TV నిర్వహించిన కార్యక్రమంలో సంతోష్ మాట్లాడుతూ…..

