తెలంగాణలో మరో 48 గంటలు అలర్ట్.. ఉత్తర జిల్లాలకు భారీ వర్ష సూచన.. రైతులకు 100 శాతం పరిహారం ఇవ్వాల్సిందే!
తెలంగాణ రాష్ట్రంలో రానున్న 48 గంటల్లో వాతావరణం మారనుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో నేడు, రేపు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. కొన్ని జిల్లాల్లో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండగా, మరికొన్ని ప్రాంతాల్లో గాలుల వేగం గంటకు 70 కిలోమీటర్ల వరకు చేరవచ్చని తెలిపింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, ములుగు, జయశంకర్ భూపాలపల్లి,…

