వివాహంపై వ్యక్తిగత దాడులు చేస్తున్నారు.. సోషల్ మీడియా ప్రచారంపై మహిళా నేత ఆవేదన
తన వివాహాన్ని వివాదంలోకి లాగుతూ, సోషల్ మీడియాలో అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారని మహిళా రాజకీయ నాయకురాలు ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్తను లక్ష్యంగా చేసుకోవడం సాధ్యం కాకపోవడంతో తనపై వ్యక్తిగత దాడులకు దిగుతున్నారని ఆరోపించారు. తన కుటుంబ సభ్యులు, స్నేహితులను సంప్రదిస్తూ తనకు వ్యతిరేకంగా ఏదైనా సమాచారం ఉందా అని ఆరా తీస్తున్నారని పేర్కొన్నారు. యూత్ కాంగ్రెస్లో తొలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన తాను రాజకీయాల్లోకి రాకముందు క్రీడాకారిణిగా దేశానికి ప్రాతినిధ్యం వహించానని ఆమె…

