నిరుద్యోగులపై నిర్బంధం.. పెండింగ్ నోటిఫికేషన్ల విడుదల కోసం దిల్సుఖ్నగర్లో భారీ ర్యాలీ
తెలంగాణలో నిరుద్యోగుల ఆందోళనలు మరోసారి ఉద్ధృతమయ్యాయి. పెండింగ్లో ఉన్న ఉద్యోగ నోటిఫికేషన్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగ యువత, విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు భారీ ఎత్తున ర్యాలీలు నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో దిల్సుఖ్నగర్లో నిర్వహించిన భారీ ర్యాలీ ఉద్రిక్తతలకు దారి తీసింది. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని ఆరోపిస్తూ యువత రోడ్లపైకి వచ్చింది. ముఖ్యంగా పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న 20,000 కానిస్టేబుల్ పోస్టులను వెంటనే భర్తీ…

