మూసి అలైన్‌మెంట్ మార్పుపై ప్రభుత్వ యూటర్న్.. ముందే నిర్ణయం తీసుంటే ప్రజలు ఇంత ఇబ్బంది పడేవారా?
మూసి పునర్జీవన ప్రాజెక్ట్‌పై తెలంగాణ ప్రభుత్వం కీలక మార్పులకు సిద్ధమవుతున్నట్టు ప్రకటించడం ఇప్పుడు కొత్త చర్చకు దారితీసింది. ముఖ్యంగా ఇండ్ల నష్టం తగ్గించేలా అలైన్‌మెంట్ మార్చాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించడం రాజకీయంగా, సామాజికంగా పెద్ద చర్చనీయాంశమైంది. అయితే ప్రజల నుంచి వస్తున్న ప్రధాన ప్రశ్న ఒక్కటే — ఇదే నిర్ణయం ముందే తీసుకుని ఉంటే ఇంత మంది ఇళ్లపై భయం, ఆందోళనలు, నిరసనలు అవసరమయ్యేవా? ప్రాజెక్ట్ ప్రారంభం నుంచే పలువురు నిపుణులు,…

