కోట్లలో భూముల కొనుగోళ్లు.. లక్షల్లోనే స్టాంప్ డ్యూటీ? రియల్ ఎస్టేట్లో బ్లాక్ మనీపై మళ్లీ చర్చ
హైదరాబాద్: తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాద్ మరియు పరిసర ప్రాంతాల్లో భూముల ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో రియల్ ఎస్టేట్ రంగంలో బ్లాక్ మనీ చలామణి అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. భూముల కొనుగోళ్లు కోట్ల రూపాయల్లో జరుగుతున్నప్పటికీ, అధికారిక రిజిస్ట్రేషన్ విలువలు మాత్రం చాలా తక్కువగా నమోదు అవుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ వర్గాల అంచనాల ప్రకారం కొన్ని ప్రాంతాల్లో ఎకరం భూమి మార్కెట్ ధర పదుల కోట్ల రూపాయలకు చేరుకున్నప్పటికీ, రిజిస్ట్రేషన్ సమయంలో చూపించే…

