బల్క సుమన్ వ్యాఖ్యలపై దుమారం.. శాంతిభద్రతలకు భంగం కలిగించే కుట్రలపై చర్యలు తీసుకోవాలి
బిఆర్ఎస్ నేత బల్క సుమన్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలను తగలబెట్టాలని, రైలు పట్టాలు తొలగించాలని చేసిన వ్యాఖ్యలు శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పనిచేసిన నాయకులు ఈ తరహా వ్యాఖ్యలు చేయడం బాధాకరమని, రాష్ట్ర ప్రజలందరూ దీనిపై ఆలోచించాలని అన్నారు. ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలు బల్క సుమన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. బిఆర్ఎస్ పార్టీ చేపడుతున్న ధర్నాలకు…

